Tirupati Wildlife: తిరుపతి శేషాచలం అటవీప్రాంతంలో కార్చిచ్చు.. ఫారెస్ట్‌ బీట్‌లో చెలరేగిన మంటలు

తిరుపతి శేషాచలం అటవీప్రాంతంలో రెచ్చిపోతున్న స్మగ్లర్లు..ఎస్‌..అటవీశాఖాధికారుల దృష్టి మరల్చేందుకు..దట్టమైన అటవీప్రాంతంలో అగ్గి రాజేస్తున్నారు. తరచూ శేషాచలం అటవీప్రాంతానికి నిప్పు పెడుతున్నారు. శేషాచలం అడవుల్లో..

Tirupati Wildlife: తిరుపతి శేషాచలం అటవీప్రాంతంలో కార్చిచ్చు.. ఫారెస్ట్‌ బీట్‌లో చెలరేగిన మంటలు
Wildlife
Follow us

|

Updated on: Mar 17, 2022 | 10:07 AM

తిరుపతి శేషాచలం(Tirupati Seshachalam) అటవీప్రాంతంలో రెచ్చిపోతున్న స్మగ్లర్లు..ఎస్‌..అటవీశాఖాధికారుల దృష్టి మరల్చేందుకు..దట్టమైన అటవీప్రాంతంలో అగ్గి రాజేస్తున్నారు. తరచూ శేషాచలం అటవీప్రాంతానికి నిప్పు పెడుతున్నారు. శేషాచలం అడవుల్లో ఉన్న ఎర్రచందనం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తేల్చారు అధికారులు. శేషాచలం అటవీప్రాంతంలోని కరకంబాడి ఫారెస్ట్‌ బీట్‌లో మంటలు ఎగసిపడ్డాయి.ఎట్టకేలకు మంటలను అదుపుచేశారు ఫైర్‌ సిబ్బంది. అయితే శేషాచలం అడవుల్లో తరచూ చెలరేగుతున్న కార్చిచ్చుతో అరుదైన వృక్ష, జంతు జాతులు అంతరించిపోతున్నాయి. అపారనష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శేషాచలం అడవుల్లో తరచూ అగ్నిప్రమాదాలపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో స్పందించిన అధికారులు విచారణ చేపట్టారు. అటవీశాఖాధికారుల దృష్టి మరల్చేందుకే నిప్పు పెడుతున్నారని తేల్చారు.

తరచూ శేషాచలం అటవీప్రాంతానికి నిప్పు పెట్టడంతో అరుదైన వృక్ష సంపద, జీవరాశుల ఉనికికే ప్రమాదంగా మారుతోంది. రెడ్‌శాండిల్‌ స్మగ్లర్ల ఆగడాలతో శేషాచలానికి అపారమైన నష్టం జరుగుతోంది. అటు తూర్పుగోదావరిజిల్లా చింతూరు ఏజన్సీలో రాజుకున్న కార్చిచ్చును అదుపులోకి తెచ్చారు అటవీశాఖ సిబ్బంది. ఆకతాయిలు కొందరు అటవీకి నిప్పంటించి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే తరచూ జరిగే అగ్ని ప్రమాదాలతో గూడెం ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నారు.

ఇదిలావుంటే.. గత మూడు.. నాలుగు రోజులుగా ఏపీలో కార్చిచ్చు కల్లోలం రేపుతోంది. అనంతపురంలో అటవీసంపద దహనం కొనసాగుతోంది. వేల ఎకరాల్లో వృక్షాలు, వందల సంఖ్యలో వన్యప్రాణులు అగ్నికి ఆహుతయ్యాయి. సోమందేపల్లి,పెనుకొండ, పుట్టపర్తి , బుక్కపట్నం, ముదిగుబ్బ అటవీ ప్రాంతాల్లో వారం రోజులుగా మంటలు చెలరేగుతున్నాయి. అడవిలో కార్చిచ్చు వ్యాపిస్తుండటంతో మృగాలు గ్రామాల్లోకి వస్తున్నాయి. సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలోకి చిరుత రావడం కలకలం రేపింది. పొలాలకు నీరు పెట్టడానికి వెళ్లిన రైతుపై చిరుతదాడికి యత్నించింది. పరుగెత్తి రైతు ప్రాణాలు కాపాడుకున్నారు.

ఇవి కూడా చదవండి: Congress: తారాస్థాయికి చేరిన కుమ్ములాట.. ఇవాళ గులాం నబీ ఆజాద్‌తో భేటీ కానున్న సోనియా

Covid Alert: ముంచుకొస్తున్న కరోనా ఫోర్త్‌ వేవ్‌ ముప్పు.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం..

Latest Articles