Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 3 నెలలకు సంబంధించిన ఆర్జిత సేవాటికెట్లు అందుబాటులోకి..ఎప్పుడంటే
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి(Tirupati) క్షేత్రానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. తాజాగా టీటీడీ(TTD) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి..
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల తిరుపతి(Tirupati) క్షేత్రానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు. తాజాగా టీటీడీ(TTD) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన తిరుమల ఆర్జిత సేవ టిక్కెట్ల(Arjitha Seva Tickets)ను రిలీజ్ చేయనుంది. మూడు నెలలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన మరియు నిజ పాద దర్శనం మొదలగు ఆర్జిత సేవ టిక్కెట్లు ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతి ద్వారా కేటాయించడం జరుగుతుంది. ఈనెల 20 వ తేదీ ఉదయం 10 గంటల నుండి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు రెండు రోజుల పాటు కేటాయిస్తారు.
కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ మొదలగు ఆర్జిత సేవ టిక్కెట్లను ఈనెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి మొదటి గా బుక్ చేసుకున్న వారికి మొదటిగా (FIFO పద్ధతిన) కేటాయించడం జరుగుతుందని టీటీడీ అధికారులు చెప్పారు. స్వామివారి ఆర్జిత సేవలను కోరుకునే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని విజ్ఞప్తి చేశారు.
Also Read: