Horoscope Today: మానసిక ఒత్తిడి తగ్గుతుంది.. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది.. గురువారం రాశిఫలాలు..
వీరు రోజు ఎక్కువగా శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది.
మేష రాశి.. వీరు రోజు ఎక్కువగా శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది.
వృషభ రాశి.. ఈరోజు వీరు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు..ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దైవ దర్శనాలు చేసుకుంటారు. బంధుమిత్రుల సహయ సాహకారాలు లభిస్తాయి.
మిథున రాశి… వీరు ఆస్తి వివాదంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సంఘంలో గౌరవం తగ్గి అపకీర్తి వచ్చే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సరైన నిర్ణయాలు తీసుకోవాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
కర్కాటక రాశి.. ఈరోజు వీరు శుభవార్తలు వింటారు.. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.. వస్తు, వాహన, అభరణాలను కొనుగోలుచేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు.
సింహ రాశి.. వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతోషంగా ఉంటారు. రుణబాధలు తొలగిపోతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు.
కన్య రాశి.. ఈరోజు వీరు చేపట్టిన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. మిత్రులతో.. కుటుంబసభ్యులతో విరోధం ఏర్పడుతుంది.. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.. పగ సాధించే ప్రయత్నాలకు దూరంగా ఉండాలి. తీసుకునే నిర్ణయాలలో జాగ్రత్తలు అవసరం.
తుల రాశి.. ఈరోజు వీరు కొత్త పనులను ప్రారంభిస్తారు. కుటంబంలో కలహాలు తగ్గిపోతాయి.. బంధుమిత్రులతో కలసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మానసిక సంఘర్షణ తగ్గుతుంది. విందులు, వినోదాల్లో పాల్గోంటారు.
వృశ్చిక రాశి.. వీరు స్నేహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయణాలు చేస్తారు.. ఖర్చులు అధికమవుతాయి. కుటుంబంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది.
ధనుస్సు రాశి.. ఈరోజు వీరికి కుటుంబంలో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. అనారోగ్య సమస్యలు వస్తాయి. బంధుమిత్రుల సహాయసహకారాలు లభిస్తాయి.
మకర రాశి.. ఈరోజు వీరు మానసిక ఒత్తిడిని జయిస్తారు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
కుంభ రాశి.. ఈరోజు వీరికి వృత్తి.. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు వాయిదా పడిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో సమస్యలు.. విభేధాలు తగ్గిపోతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం.
మీనరాశి.. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ ప్రయాసలు తప్పవు.. ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది. ఉద్యోగంలో సమస్యలు వస్తాయి. మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. కొత్త పనులను ప్రారంభిస్తారు.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)