Congress: తారాస్థాయికి చేరిన కుమ్ములాట.. ఇవాళ గులాం నబీ ఆజాద్‌తో భేటీ కానున్న సోనియా

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయంతో తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి మొదలైంది. ఇప్పటికే ఆ పార్టీ సీడబ్ల్యూసీ మీటింగ్​నిర్వహించగా.. బుధవారం జరిగిన జీ23 నేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Congress: తారాస్థాయికి చేరిన కుమ్ములాట.. ఇవాళ గులాం నబీ ఆజాద్‌తో భేటీ కానున్న సోనియా
Ghulam Nabi Azad And Sonia
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 17, 2022 | 8:25 AM

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయంతో తర్వాత కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి మొదలైంది. ఇప్పటికే ఆ పార్టీ సీడబ్ల్యూసీ మీటింగ్​నిర్వహించగా.. బుధవారం జరిగిన జీ23 నేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సీనియర్​నేత గులామ్​నబీ ఆజాద్​ (Ghulam Nabi Azad)నివాసంలో జరిగిన ఈ భేటీలో పార్టీ బలోపేతంపై నేతలు తమ ప్రతిపాదనలు సూచించారు. అయితే తాజాగా కాంగ్రెస్​ సీనియర్​నేత గులాం నబీ ఆజాద్.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో(SONIA GANDHI) గురువారం భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై జీ23 నేతలు బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రతిపాదించిన కొన్ని అంశాలను సోనియాకు వివరించనున్నారు ఆజాద్.

కాగ ఈ డిమాండ్లపై చ‌ర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స‌మావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ స‌మావేశంలో ప్ర‌స్తావించిన అంశాల‌ను, ప్ర‌తిపాద‌న‌ల‌ను ఆజాద్ సోనియా గాంధీకి వివరించనున్నారు. అయితే గులాం న‌బీ ఆజాద్‌తో జరగనున్న భేటీలో సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉంటారని తెలుస్తోంది.  ఈ స‌మావేశం పై కాంగ్రెస్ శ్రేణుల్లో స‌ర్వ‌త్ర ఉత్కంఠ నెలకొంది.

ఆజాద్​నివాసంలో సమావేశమైన జీ23 నేతలు.. పార్టీ బలోపేతం కావాలంటే ప్రతి స్థాయిలో సమష్టి, సమ్మిళిత నాయకత్వంతోనే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దెదించాలంటే కాంగ్రెస్​ విధానాలకు దగ్గరగా ఉండే పార్టీలతో అధిష్ఠానం చర్చలు జరిపి కూటమిని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ మీటింగ్​లో తీసుకున్న నిర్ణయాలు, పార్టీ బలోపేతానికి గల మార్గాలపై నేతలు చర్చించారు.

ఇవి కూడా చదవండి: Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదు..

Harbhajan Singh: మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ ఆఫర్.. రాజ్యసభకు పంపించే ఛాన్స్?