AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Alert: ముంచుకొస్తున్న కరోనా ఫోర్త్‌ వేవ్‌ ముప్పు.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం..

Coronavirus: భారత్‌లో మళ్లీ కరోనా కోరలు చాస్తుందా..? భారత్‌లో కరోనా ఫోర్త్‌ వేవ్‌ ముప్పు పొంచిఉందా..? అవును.. రోజు రోజుకు పెరుగుతున్న కేసులను చూస్తే అలానే అనిపిస్తోంది. దీనికి తోడు కేంద్రం మరోసారి అలర్ట్ ప్రకటించింది. 

Covid Alert: ముంచుకొస్తున్న కరోనా ఫోర్త్‌ వేవ్‌ ముప్పు.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం..
Covid Vaccination
Sanjay Kasula
|

Updated on: Mar 17, 2022 | 7:31 AM

Share

కొన్ని రోజులుగా కరోనా(Corona) మహమ్మారి కాస్త కూల్‌గా ఉందనుకున్న సమయంలో.. వరల్డ్‌ వైడ్‌గా మళ్లీ వైరస్‌ హైటెన్షన్‌ క్రియేట్‌ చేస్తోంది. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు.. తన రూపాన్ని మారుస్తోంది మహమ్మారి. వేగంగా విస్తరిస్తూ.. ఒక్కోచోట ఒక్కో తరహాలో దాడి చేస్తోంది. కొత్త రూపాలు.. సరికొత్త లక్షణాలతో విరుచుకుపడుతోంది. ఇప్పుడు తాజాగా.. మళ్లీ కరోనా కొత్త వేరియంట్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. ఆల్‌ ఈజ్‌ వెల్‌ అనుకున్నాం. కానీ, సీన్‌ మారడానికి ఎక్కువ టైం పట్టలేదు. దీంతో మళ్లీ భయం మొదలైంది. కరోనా కొత్త రూపం దాల్చింది. స్టెల్త్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌.. ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. భారత్‌లో మళ్లీ కరోనా కోరలు చాస్తుందా..? భారత్‌లో కరోనా ఫోర్త్‌ వేవ్‌ ముప్పు పొంచిఉందా..? అవును.. రోజు రోజుకు పెరుగుతున్న కేసులను చూస్తే అలానే అనిపిస్తోంది. దీనికి తోడు కేంద్రం మరోసారి అలర్ట్ ప్రకటించింది.

స్కూల్స్‌ రీ ఓపెనింగ్‌, ఆఫీసులకు తిరిగి వెళ్తుండడం, మాస్క్‌ నిబంధనల సడలింపు కారణాల అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు వేడిమి పరిస్థితులతో జనాలు బయటే ఎక్కువగా తిరుగుతున్నారు. ఈ తరుణంలో.. వైరస్‌ విజృంభిస్తోందని అంచనా వేస్తున్నారు. చైనాలో మ‌ళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయ్యింది. కేంద్ర కుటుంబ సంక్షేమ‌, ఆరోగ్య మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ బుధ‌వారం అధికారుల‌తో ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఆరోగ్య శాఖ కార్య‌దర్శి, ఎన్‌సీడీసీ చీఫ్‌, డ్ర‌గ్ కంట్రోల‌ర్ ఆఫ్ ఇండియా, డీబీటీ సెక్రెట‌రీ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ముఖ్యంగా మూడింటిపై దృష్టి సారించాల‌ని మాండ‌వీయ అధికారుల‌ను ఆదేశించారు. కేసుల పెరుగుద‌ల‌, జీనోమ్ సీక్వెన్సీ, ఇన్‌ఫెక్ష‌న్ పెరుగుద‌ల‌.. ఈ మూడింటిపై నిఘా పెట్టాల‌ని కేంద్ర మంత్రి మాండ‌వీయ అధికారులను సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ఇటీవల తగ్గుతూ వచ్చిన మహమ్మారి తీవ్రత గత కొద్ది రోజులుగా పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ముప్పు పెరుగుతున్నది. ఈ సబ్‌ వేరియంట్‌పై చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నది.

మంగళవారం 24 గంటల్లో 5,280 కొత్త కరోనా (Covid-19) కేసులు నమోదయ్యాయి. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,80,60,93,107 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. 2020 ఫిబ్రవరి 12న చైనాలో అత్యధికంగా 14వేలకుపైగా కేసులు నమోదవగా.. రెండు రోజుల కిందట భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవడం భయాందోళనకు గురి చేస్తున్నది.

దేశ వ్యాప్తంగా నిన్న 7,52,818 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వాటితో కలిపి ఇప్పటివరకు దేశంలో 78.05 కోట్ల పరీక్షలు చేసినట్లు వైద్య శాఖ తెలిపింది. చైనాతో పాటు పశ్చిమ యూరప్‌, బ్రిటన్‌, అమెరికాలో కేసులు కొత్త కేసులు పెరుగుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్నాయని వియత్నాం, జర్మనీ, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌లో కేసులు ఇప్పటికే ధ్రువీకరించాయి. ఇక్కడ రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి: Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదు..

Harbhajan Singh: మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ ఆఫర్.. రాజ్యసభకు పంపించే ఛాన్స్?