Rare Bird: కొబ్బరి తోటలో ప్రత్యేక్షమైన అరుదైన పక్షి.. ప్రాణం పోసిన రైతు.. అసలేమైందంటే..?
Rare Owl found: ప్రకృతి ప్రపంచంలో ఎన్నో రకాల పక్షలు, జీవులు సంచరిస్తుంటాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరిస్తూ.. సందడి చేస్తుంటాయి.
Rare Owl Bird: ప్రకృతి ప్రపంచంలో ఎన్నో రకాల పక్షలు, జీవులు సంచరిస్తుంటాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరిస్తూ.. సందడి చేస్తుంటాయి. కొన్ని రోజులనుంచి వీదేశాల నుంచి వచ్చిన పక్షులు ఏపీ లోని పలు ప్రాంతాల్లో సందడి చేస్తున్నాయి. కాగా.. తాజాగా ఏపీలో ఓ అరుదైన పక్షి ఏపీలో కనిపించింది. పశ్చిమ గోదావరి (West Godavari) జిల్లా పేరుపాలెం సముద్ర తీరం కొబ్బరి తోటలో రైతులకు అరుదైన పక్షి తారస పడింది. దానిని కాకులు చుట్టుముట్టి దాడి చేస్తుండగా గమనించిన రైతు సత్యనారాయణ కాకుల దాడి నుంచి ఆ పక్షి ని రక్షించి సపర్యలు చేశారు. అనంతరం ఆ రైతు పక్షిని చెట్లపైకి వదిలేయడంతో ఎగిరిపోయింది.
ఈ వింత పక్షి అటవీ ప్రాంతంలో ఉండే గుడ్ల గూబ జాతికి చెందిన పక్షి అని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇవి రాత్రి సమయంలో మాత్రమే సంచరిస్తూ చిన్న జాతి పక్షులు, పాములు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటాయని పేర్కొంటున్నారు. ఈ జాతి పక్షులు పశ్చిమ తీర ప్రాంతంలో కనబడటం తొలిసారి అని చెబుతున్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఇలాంటి గుడ్లగూబ తారసపడలేదంటూ పక్షి ప్రేమికులు పేర్కొంటున్నారు. ఎండాకాలం కావున పక్షలు నీటికోసం అల్లాడుతుంటాయని.. ఆరుబయటి ప్రాంతాల్లో, ఇంటి మేడలపై డబ్బాలల్లో నీటిని ఉంచాలని కోరుతున్నారు పక్షి ప్రేమికులు.
Also Read: