Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్.

మన కళ్లు మననే మోసం చేస్తాయని చాలా సార్లు విని ఉంటాం. అయితే కొన్నిసార్లు మన కళ్లను మనం కూడా మోసం చేసుకుంటాం. ఇది ఎప్పుడు జరుగుతుందంటే.. మనం చూస్తున్నది నిజం.. అని తెలిసి కూడా నమ్మకుండా..

ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా?.. కనుక్కుంటే మీరు జీనియస్.
Cat Is Going Up Or Down
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 17, 2022 | 12:09 PM

ఈ ఫోటోలో పాము ఎక్కడ ఉందో గుర్తు పట్టండి.. ఇందులో పులి ఉంది గుర్తించారా.. అంటూ మీరు చాలా సార్లు చదవి ఉంటారు. వారు విసిరిన సవాల్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని గుర్తించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇవాళ నెటింట్లో ఓ పిల్లి ఫోటో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంటర్నెట్ మళ్లీ ఆప్టికల్ భ్రమపై మరొక ఉత్కంఠ చర్చలో ఓ పిల్లి చిక్కింది. ఈ పిల్లి చాలా మంది మేధావులను తికమక పెడుతోంది. అంతే కాదు బోలెడు ప్రశ్నలకు తెరలేపుతోంది. ఈ ఫోటోను పరిశీలనగా చూసిన తర్వాత కూడా చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. తప్పుడు సమాధానం చెబుతున్నారు. అయినా మరోసారి ప్రయత్నిస్తున్నారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ పిక్చర్ ఆన్‌లైన్‌లో మెదడుకు మేత పెడుతోంది. అసలు ఇందులోని ఈ ఫోటోలో పిల్లి స్టెప్స్ ఎక్కుతోందా? దిగుతోందా? అన్నదే పెద్ద ప్రశ్న. అసలు ఎటువైపు పిల్లి కదులుతుందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే మీకు కూడా సరైన సమాధానం దొరుకుతుంది.

చిత్రం మెట్ల సెట్‌పై తన అడుగులు, తోకతో ఉన్న పిల్లిని చూపిస్తుంది. మీరు చూసే కోణంపై మీ ఆన్సర్ ఉంటుంది. ఎందుకంటే ఇందులోని మెట్లుపై కాంతి పడినప్పుడు పిల్లి పైకి కదులుతున్నట్లుగా ఉంటుంది. కాంతి మెట్లపై నుంచి వస్తుందని అనుకుంటే కిందికి దిగుతున్నట్లుగా ఉంటుంది. అదే పైకప్పు నుంచి వచ్చే కాంతితో పిల్లి క్రిందికి వెళ్లడం మీరు ఓ రకమైన భ్రమకు గురవుతారు.

This Cat Is Going Up Or Dow

This Cat Is Going..

అయితే, పిల్లి మెట్లు ఎక్కుతుందని నమ్మేవారిలో మీరు కూడా ఉంటే.. మీరు బహుశా జీవితంపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు. మీరు ఆశావాది, మీరు ఎక్కడ చూసినా సంభావ్యత.. వృద్ధిని సాధిస్తారని మైండ్ జర్నల్ పేర్కొంది.

పిల్లి మెట్లపైకి వెళ్లడాన్ని గమనించిన వారు జీవితంలో ముందుకు సాగడానికి మార్గాలను వెతకడానికి తమ మనస్సును కలిగి ఉంటారు. కాబట్టి ఇతరులకన్నా పైకి ఎదగడం లేదా వారి స్థాయికి పడిపోవడం మధ్య ఎంపికను బట్టి వారు ఎల్లప్పుడూ పైకి ఎదగాలని ఎంచుకుంటారు.

అయితే, పిల్లి మెట్లు దిగుతున్నట్లు మీ పరిశీలనలో ఉంటే.. మీరు చాలా నిరాశావాద.. సందేహాస్పదంగా ఉన్నారని కథనం పేర్కొంది. మీ వ్యక్తిత్వం మీ జీవిత అనుభవాల ద్వారా.. మీరు ఎదుర్కొన్న వ్యక్తుల రకాల కారణంగా మీ అభిప్రాయాన్ని ప్రతికూల వైపుకు మళ్లించేలా ఉందని అర్థం. ఇప్పటికే మీ వ్యక్తిత్వం ప్రభావితమై ఉండవచ్చని మైండ్ జర్నల్ పేర్కొంది.

అయినప్పటికీ, మీరు ఇప్పుడు సులభంగా విశ్వసించరని.. మీరు కమిట్ అయ్యే ముందు చాలా లెక్కలు వేస్తారని.. చాలా తీపిగా కనిపించే వ్యక్తులపై మీకు సందేహం ఉంటుందని సూచిస్తుంది.

ఇవి కూడా చదవండి: Congress: తారాస్థాయికి చేరిన కుమ్ములాట.. ఇవాళ గులాం నబీ ఆజాద్‌తో భేటీ కానున్న సోనియా

Covid Alert: ముంచుకొస్తున్న కరోనా ఫోర్త్‌ వేవ్‌ ముప్పు.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం..