జగన్‌కు జేసీ సవాల్.. రాజధానిని మార్చితే..!

సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రాజధాని విషయంలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడిన జేసీ.. జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం పిల్ల చేష్టలతో రాజధానిని మార్చితే… ఉద్యమం రావడం ఖాయమని జేసీ అన్నారు. రాజధాని విషయం ఇప్పుడు రెండు కులాల మధ్య చిచ్చు పెడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. 75 ఏళ్లలో అమరావతిలో ఎప్పుడూ వరదలు రాలేదని.. నది ఒడ్డున ఉండే పట్టణాలే అభివృద్ధి చెందుతున్నాయని […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:57 pm, Sun, 12 January 20
జగన్‌కు జేసీ సవాల్.. రాజధానిని మార్చితే..!

సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రాజధాని విషయంలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడిన జేసీ.. జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం పిల్ల చేష్టలతో రాజధానిని మార్చితే… ఉద్యమం రావడం ఖాయమని జేసీ అన్నారు. రాజధాని విషయం ఇప్పుడు రెండు కులాల మధ్య చిచ్చు పెడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. 75 ఏళ్లలో అమరావతిలో ఎప్పుడూ వరదలు రాలేదని.. నది ఒడ్డున ఉండే పట్టణాలే అభివృద్ధి చెందుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. అమరావతిని మార్చితే గ్రేటర్ రాయలసీమ కోసం ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఆర్థికంగా జగన్ తనను ఇబ్బందులు పెట్టొచ్చు కానీ… రాజకీయంగా మాత్రం ఏమీ చేయలేరని ఈ సందర్భంగా సూచించారు. రాజధానిని మార్చితే, కడపను రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తానని చెప్పారు. అయినా చంద్రబాబు తాత్కాలిక భవనాల వల్లే ఈ పరిస్థితులు వచ్చాయని.. అమరావతిపై కేవలం జగన్‌వి కక్ష సాధింపు చర్యలేనని అన్నారు. రాయలసీమ ఉద్యమాన్ని కూడా పోలీసులు పెట్టి అడ్డుకుంటే అడ్డుకోండి అంటూ జగన్‌కు జేసీ సవాల్ విసిరారు.