AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: పక్కా 420.. పోలీసులతో చిక్కడు దొరకడు గేమ్ ఆడాడు.. చివరికి ఇలా పాపం పండింది

అనంతపురం జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగ నాగిరెడ్డి అరెస్టు చేశారు పోలీసులు. విడపనకల్లు వద్ద ఈనెల 4వ తేదీన జరిగిన యాక్సిడెంట్లో తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే రోడ్డు ప్రమాదంలో నాగిరెడ్డి ప్రయాణిస్తున్న కారులో డబ్బు బంగారు ఆభరణాలు లభించడంతో అనుమానం వచ్చి లోతుగా దర్యాప్తు చేయడంతో..

Andhra: పక్కా 420.. పోలీసులతో చిక్కడు దొరకడు గేమ్ ఆడాడు.. చివరికి ఇలా పాపం పండింది
Telugu News
Nalluri Naresh
| Edited By: Ravi Kiran|

Updated on: Oct 15, 2025 | 12:05 PM

Share

అతడు ఓ అంతరాష్ట్ర దొంగ. ఇప్పటికే 45 కేసులలో నిందితుడు. చిక్కడు దొరకడులా ఇప్పటివరకు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. చిక్కినట్టే చిక్కి పలుమార్లు పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యాడు. దీంతో ఇప్పటికే అతడి కారణంగా 11 మంది పోలీసులు కూడా సస్పెండ్ అయ్యారు. అయితే విధి విచిత్రమో ఏమో కానీ ఓ యాక్సిడెంట్లో అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి 18 సంవత్సరాల వయస్సు నుండే జల్సాలకు అలవాటు పడ్డాడు. ఉమ్మడి అనంతపురం జిల్లా, కర్నూలు, చిత్తూరు, కడప, తెలంగాణ, కర్ణాటక, చత్తీస్గడ్ రాష్ట్రాలలో చోరీలకు పాల్పడ్డాడు. వేరువేరు ప్రాంతాలలో మొత్తం 45 కేసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నాగిరెడ్డిపై నమోదు అయ్యాయి.

ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు

2023లో వైయస్సార్ జిల్లా కొండాపురంలో పోలీసులకు చిక్కినా అనుహ్యంగా పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు. అప్పట్లో పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఈనెల 4వ తేదీ ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిర్లక్ష్యంగా అతివేగంతో కారు నడిపిన నాగిరెడ్డి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. ప్రమాదంలో ఎదురుగా రెండు కార్లు ఢీకొనడంతో… విశాఖపట్నంకు చెందిన సుధీర్, లావణ్య దంపతులు మృతి చెందారు. నాగిరెడ్డి కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. తీవ్ర గాయాల పాలైన నాగిరెడ్డిని ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గురైన కారులో మూడున్నర లక్షల రూపాయల నగదు, కొన్ని వెండి ఆభరణాలు కూడా లభ్యమయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఘటనా స్థలాన్ని పరిశీలించిన గుంతకల్లు డిఎస్పి శ్రీనివాసులుకు ఎక్కడో చిన్న అనుమానం వచ్చింది. నాగిరెడ్డి గురించి ఆరా తీయగా… అతని నేర చరిత్ర మొత్తం బయటపడింది. తీవ్ర గాయాలపాలైన ఇతడిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేసి చికిత్స అందించారు. నాగిరెడ్డి గాయాలు మెరుగైన వెంటనే అరెస్టు చేసిన పోలీసులు ఉరవకొండ కోర్టులో హాజరు పరిచారు. ఇంతకాలం ముప్పు తిప్పలు పెట్టిన ఈ మాయగాడు ఎట్టకేలకు రోడ్డు ప్రమాదం రూపంలో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!