డల్ గా ఉన్న కిచెన్ ని ఆమె ఎలా అందంగా తీర్చి దిద్దిందో చూడాలంటే బ్రిటన్ వెళ్లాల్సిందే !

బ్రిటన్ లో ఓ మహిళ తన ఇంట్లో కళావిహీనంగా..డల్ గా ఉన్న తన వంట గది (కిచెన్) ని చూడముచ్ఛటగా..అందంగా తీర్చిదిద్దాలనుకుంది. దీన్ని ఎలా డెకరేట్ చేయాలన్నది ఆమెకు ఒక పట్టాన తోచలేదు.

డల్ గా ఉన్న కిచెన్ ని  ఆమె ఎలా అందంగా తీర్చి దిద్దిందో  చూడాలంటే బ్రిటన్  వెళ్లాల్సిందే !
Woman Renovates Her Kitchen
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 16, 2021 | 10:30 PM

బ్రిటన్ లో ఓ మహిళ తన ఇంట్లో కళావిహీనంగా..డల్ గా ఉన్న తన వంట గది (కిచెన్) ని చూడముచ్ఛటగా..అందంగా తీర్చిదిద్దాలనుకుంది. దీన్ని ఎలా డెకరేట్ చేయాలన్నది ఆమెకు ఒక పట్టాన తోచలేదు. చివరకు ఆలోచించగా ఆమెకు మంచి ఐడియా తట్టింది. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఖాళీగా కూర్చునే బదులు ఇక రంగంలోకి దిగింది. వేలాది నాణేలు సేకరించి వాటిని ఓర్పుగా..నేర్పుగా వంటగది గోడలకు అంటించింది. 75 పౌండ్ల (మన కరెన్సీలో రూ. 7.6380 ఖర్చుతో ఒక పెన్నీ నాణేలలను మొత్తం గోడలకు అంటించి చూసుకుంది. అంతే ! ఆమె ఆనందానికి అంతు లేకపోయింది. ఈ పని చేయడానికి ఆమెకు 9 గంటలు పట్టిందట.. యూకే లోని లాంకషైర్ కి చెందిన బిల్లీ అనే ఈమె తన ఫేస్ బుక్ లో ఈ కిచెన్ తాలూకు ఫోటోలను పోస్ట్ చేయగానే.నెటిజన్లు ఆమె ఓర్పు, సహనానికి ఆశ్చర్యపోయారు. ఆమెను అదేపనిగా అభినందించారు. ఇక ఆమె భర్త కూడా తన భార్యను అభినందనలతో ముంచెత్తాడు.

నిజానికి ఈమె పెద్ద ఆరిస్టుగానీ, కళలపట్ల ఆసక్తి గానీ ఉన్న వ్యక్తి కాదు.. లాక్ డౌన్ కాలంలో తన కిచెన్ఇ ని ఇలా డెకరేట్ చేయడమే మంచిదని నిర్ణయించుకుని ఇందుకు నడుం కట్టిందట..ఇన్ని వేల నాణేలను గోడలకు అతికించడమంటే మాటలు కాదని ఆమె ఇంటి చుట్టుపక్కలవారు కూడా బిల్లీని పొగడ్తలతో ఆకాశానికెత్తేస్తున్నారు. లాంకషైర్ లో ఇప్పుడు ఈమె ఓ సెలబ్రిటీ అయిపొయింది.

మరిన్ని ఇక్కడ చూడండి: తమిళనాట శశికళ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ..? తాజా ఆడియో క్లిప్ లో ఆమె ఏమన్నారంటే ..?

తమిళనాట శశికళ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ..? తాజా ఆడియో క్లిప్ లో ఆమె ఏమన్నారంటే ..? .