AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moscow Variant: రూపం మార్చుకున్న కరోనా వైరస్.. మాస్కోలో కొత్త వేరియంట్.. సుత్నిక్ పనిచేస్తుందా లేదా అనే ఆందోళన

New Russian Covid variant:  2019 ఏడాది చివరిలో చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా.. ప్రపంచాన్ని చుట్టేసింది. పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని దేశాలు కరోనా బాధిత దేశాలుగా...

Moscow Variant:  రూపం మార్చుకున్న కరోనా వైరస్.. మాస్కోలో కొత్త వేరియంట్..  సుత్నిక్ పనిచేస్తుందా లేదా అనే ఆందోళన
Covid-19 Research
Surya Kala
|

Updated on: Jun 17, 2021 | 6:13 AM

Share

New Russian Covid variant:  2019 ఏడాది చివరిలో చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా.. ప్రపంచాన్ని చుట్టేసింది. పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని దేశాలు ఈ కరోనా బాధిత దేశాలుగా మారిపోయాయి. ఓ వైపు కరోనా కట్టడికి నివారణ చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు చాలా దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇజ్రాయిల్, అమెరికా వంటి దేశాల్లో టీకాలు ఇవ్వడం ఇప్పటికే పూర్తి అయ్యింది. అయితే ఈ కరోనా ఎప్పటికప్పుడు తన రూపం మార్చుకుంటూ.. సారికొత్త వేరియెంట్స్ తో ప్రపంచ దేశాలను కలవర పెడుతూనే ఉంది.

రష్యాలో కొత్త వేరియంట్ ను కనుగొన్నారు. కరోనా వైరస్‌ మరోసారి రూపాంతరం చెందిందని.. కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌ను కనుగొన్నట్లు గమలేయా నేషనల్‌ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. మాస్కోలో తొలిసారిగా వెలుగుచూడటంతో ఈ వైరస్‌ కు మాస్కో పేరుతో పిలుస్తున్నామని చెప్పారు.

రష్యాలో తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ కేసులు భారీగా నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. రోజువారీ కేసుల నమోదు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు చేయగా ఈ రకం వైరస్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కొత్త స్ట్రెయిన్‌ వైరస్‌పై స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ ప్రభావం చూపుతుందో తెలుసుకునే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారని గమలేయా నేషనల్‌ సెంటర్‌ హెడ్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ వివరించారు. ఈ వైరస్‌పై పరిమిత సమాచారం మాత్రమే ఉందని సుత్నిక్ వ్యాక్సిన్ పనిచేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.

బుధవారం కొత్తగా 13.397 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 396 మంది మరణించారు. ఒక్క రష్యా రాజధాని మాస్కో లో దాదాపు ఆరువేల కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.