తమిళనాట శశికళ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ..? తాజా ఆడియో క్లిప్ లో ఆమె ఏమన్నారంటే ..?
తమిళనాడులో అన్నా డీఎంకే బహిష్జ్కృత నేత శశికళ మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు ? కొన్ని రోజులుగా ఈ సస్పెన్స్ కొనసాగుతోంది. 'ఇక నేను మౌన ప్రేక్షకురాలిగా ఉండలేను...త్వరలోనే రంగ ప్రవేశం చేస్తా'
తమిళనాడులో అన్నా డీఎంకే బహిష్జ్కృత నేత శశికళ మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు ? కొన్ని రోజులుగా ఈ సస్పెన్స్ కొనసాగుతోంది. ‘ఇక నేను మౌన ప్రేక్షకురాలిగా ఉండలేను…త్వరలోనే రంగ ప్రవేశం చేస్తా’ అని ఆమె వ్యాఖ్యానించినట్టు చెబుతున్న ఆడియో క్లిప్ ఒకటి బుధవారం వెలుగులోకి వచ్చింది. అన్నా డీఎంకే ని సక్రమంగా నడపవలసిన పరిస్థితి సమీపించిందని, ఇక తాను మౌన ప్రేక్షక పాత్ర వహించజాలనని ఆమె చెప్పినట్టు ఈ ఆడియో క్లిప్ లో స్పష్టంగా వినిపిస్తోంది. లాక్ డౌన్ అనంతరం నేను మళ్ళీ క్రియా శీల రాజకీయాల్లో దిగుతానని ఆమె కొన్ని రోజుల క్రితం పేర్కొన్నారట.. ఈ ఆడియో క్లిప్ కూడా బయటకి వచ్చింది. ఓక సందర్బంలో తాను రాజకీయాల జోలికి రానని ప్రకటించిన ఆమె.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే ఓటమితో మళ్ళీ తన మనసు మార్చుకున్నట్టు ఉందని అంటున్నారు.
పైగా ఇటీవల పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణపై 11 మంది పార్టీ కార్కర్తలను అన్నా డీఎంకే బహిష్కరించింది. దీంతో వీరంతా ‘చిన్నమ్మ’ శరణు జొచ్చారు. మీరు మళ్ళీ ఈ పార్టీని సక్రమ పంథాలో పెట్టాలని వారంతా కోరారట.. ఇందుకు ఆమె… త్వరలోనే అమ్మ (జయలలిత) పాలన తెస్తామని చెప్పారట. మాజీ సీఎం . అన్నాడీఎంకే నేత పళనిస్వామి మాత్రం ఆమె రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో తిరిగి ఆమెను చేర్చుకునే పరిస్థితే లేదని ఆయన చాలా సార్లు పేర్కొన్నారు.
కాగా-జయకుమార్ వంటి అన్నాడీఎంకె పార్టీ నేతలుశశికళ ‘ఆడియో క్లిప్ పాలిటిక్స్’ నడుపుతున్నారని ఆరోపిస్తున్నారు. పార్టీలో మళ్ళీ ఆమె రాకక ఫలించబోదని, ఆమె చేసే ప్రయత్నాలు నీరు గారిపోతాయని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: YS Sharmila Party: వైయస్ షర్మిలకు మొదటిలోనే పార్టీ లో చుక్కెదురు.. ఆ నేత రాజీనామా.. ( వీడియో )