దయ చేసి బెంగాల్ కి తిరిగి రాకండి… ఢిల్లీలోనే ఉండండి.. గవర్నర్ కి తృణమూల్ కాంగ్రెస్ నేతల ‘హితవు’

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై బెంగాల్ గవర్నర్ జగ దీప్ ధన కర్, సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మధ్య విభేదాలు మళ్ళీ రచ్చకెక్కాయి.

దయ చేసి బెంగాల్ కి తిరిగి రాకండి... ఢిల్లీలోనే ఉండండి.. గవర్నర్ కి తృణమూల్ కాంగ్రెస్ నేతల 'హితవు'
Don't Come To Bengal
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 16, 2021 | 10:32 PM

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై బెంగాల్ గవర్నర్ జగ దీప్ ధన కర్, సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మధ్య విభేదాలు మళ్ళీ రచ్చకెక్కాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై గవర్నర్ ఆమెకు రాసిన లేఖను రాష్ట్ర హోమ్ శాఖ బట్టబయలు చేసింది. అది పబ్లిక్ గా వివాదమైంది. ఒక గవర్నర్ ముఖ్యమంత్రికి లేఖ రాయడమనన్నది ఎక్కడ లేదని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. గవర్నర్ రాజ్యాంగ నిబంధనలను అతిక్రమించారని, ఆయన ఇక ఢిల్లీలోనే ఉండడం మంచిదని సౌగత రాయ్ వంటి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న జగ దీప్ ధన్ కర్ మరో నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. అయితే ఇందుకు కారణాలు తెలియడంలేదు. తాను బుధవారం పలువురు కేంద్ర మంత్రులతో జరిపిన సమావేశ వివరాలను ఆయన ట్వీట్స్ చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ విశ్వాసం లోకి తీసుకోలేదని, అదే పనిగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి గవర్నర్ ని తాము ఎక్కడా చూడలేదని తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

అటు- రాష్టంలో అధికారులు, పోలీసులు సైతం తన ఆదేశాలను పాటించడం లేదని గవర్నర్ కేంద్ర నేతలకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది, సీఎం మమతా బెనర్జీ కూడా తన పట్ల ఏ మాత్రం గౌరవం చూపడం లేదని ఆయన వాపోయినట్టు చెబుతున్నారు. అయితే ఈ పరిణామాలపై మమత మౌనంగా ఉన్నారు.. ఆమె అభిప్రాయాలను తెలుసుకునేందుకు మీడియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

మరిన్ని ఇక్కడ చూడండి: డల్ గా ఉన్న కిచెన్ ని ఆమె ఎలా అందంగా తీర్చి దిద్దిందో చూడాలంటే బ్రిటన్ వెళ్లాల్సిందే !

తమిళనాట శశికళ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ..? తాజా ఆడియో క్లిప్ లో ఆమె ఏమన్నారంటే ..?