పాకిస్తాన్ మాజీ ప్రధాని ఎక్కడ.. కీలక ప్రకటన చేసిన ఇమ్రాన్ ఖాన్ సోదరి
పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలులో సురక్షితంగా ఉన్నారని ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ వెల్లడించారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జైలులో ఇమ్రాన్‌ను మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యంపై వదంతులు మొదలయ్యాయి.

పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలులో సురక్షితంగా ఉన్నారని ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ వెల్లడించారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జైలులో ఇమ్రాన్‌ను మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యంపై వదంతులు మొదలయ్యాయి.
పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ ధృవీకరించారు. అడియాలా జైల్లో ఇమ్రాన్‌ను కలిశారు ఉజ్మా ఖానుమ్. దీంతో ఇమ్రాన్‌ఖాన్ చనిపోయారని వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. ఆయన జైలులో సురక్షితంగానే ఉన్నారని సోదరి ఉజ్మా ఖానుమ్ తెలిపారు. అయితే, మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపించారు. ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతించాలంటూ ఇస్లామాబాద్‌తో పాటు పలు చోట్ల భారీ ఆందోళనలు చెలరేగాయి. దీంతో ఉజ్మాతో పాటు ఓ లాయర్ ఆయన్ని కలిసేందుకు జైలు అధికారులు మంగళవారం (డిసెంబర్ 02) అనుమతించారు.
ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేశాయి. ఆయన సేఫ్‌గా ఉన్నారని తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ.. ఆయన్ని చూపించాలని, ఆరోగ్య పరిస్థితిపై వివరాలు వెల్లడించాలని మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతించాలని కుటుంబ సభ్యులు కోరారు. అందుకు జైలు అధికారులు మంగళవారం వరకూ నిరాకరిస్తూ వచ్చారు. దీంతో ఇమ్రాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇమ్రాన్‌ను కలిసేందుకు అధికారులు అనుమతించారు.
అవినీతి ఆరోపణలపై పాక్ ప్రభుత్వం ఇమ్రాన్‌ఖాన్‌ను జైల్లో పెట్టింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై గత నెల చివరి నుంచి ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ఆయన ముగ్గురు చెల్లెళ్లు నురీన్ నియాజి, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్ కలవడానికి ప్రయత్నిస్తే తమపై దాడి జరిగిందని చేసిన ప్రకటనతో ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఇదే సమయంలో ఇమ్రాన్ ఖాన్ కుమారులు ఆయన ఆరోగ్యం గురించి చేసిన వ్యాఖ్యలు ఈ భయాలను మరింత కలవరానికి గురిచేశాయి. తమ తండ్రి పరిస్థితి గురించి జైలు అధికారులు ఏదో దాస్తున్నారని వారు ఆరోపించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
