AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుతిన్ భారతీయ ఆహారాన్ని ఎందుకు తినరు.. మరి విలాసవంతమైన విందు వండేదెవరు..?

అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ రష్యా వెలుపల ప్రయాణించినప్పుడల్లా, అతనితో పాటు మొత్తం "ఫుడ్ కాన్వాయ్" ఉంటుంది. ఫస్ట్‌పోస్ట్ కథనం ప్రకారం, గురువారం (డిసెంబర్ 04) సాయంత్రం ఆయన IL-96 విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ కాబోతుంది. దానిలో రష్యన్ ట్వోరోగ్, రష్యన్ ఐస్ క్రీం, రష్యన్ తేనె, రష్యన్ వాటర్ బాటిల్ ప్రత్యేక కంపార్ట్‌మెంట్‌లో ప్యాక్ చేసి వస్తోంది.

పుతిన్ భారతీయ ఆహారాన్ని ఎందుకు తినరు.. మరి విలాసవంతమైన విందు వండేదెవరు..?
Vladimir Putin Food
Balaraju Goud
|

Updated on: Dec 04, 2025 | 12:54 PM

Share

అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ రష్యా వెలుపల ప్రయాణించినప్పుడల్లా, అతనితో పాటు మొత్తం “ఫుడ్ కాన్వాయ్” ఉంటుంది. ఫస్ట్‌పోస్ట్ కథనం ప్రకారం, గురువారం (డిసెంబర్ 04) సాయంత్రం ఆయన IL-96 విమానం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ కాబోతుంది. దానిలో రష్యన్ ట్వోరోగ్, రష్యన్ ఐస్ క్రీం, రష్యన్ తేనె, రష్యన్ వాటర్ బాటిల్ ప్రత్యేక కంపార్ట్‌మెంట్‌లో ప్యాక్ చేసి వస్తోంది.

ఎప్పటిలాగే, ఈసారి కూడా పుతిన్ భారతీయ చెఫ్‌లు వండిన ఆహారాన్ని తినరు. 2014 డిసెంబర్‌లో పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు, ముంబైలోని తాజ్ హోటల్‌లోని ఒక అంతస్తు మొత్తాన్ని రష్యన్ FSO స్వాధీనం చేసుకుంది. హోటల్ వంటగది నుండి అన్ని భారతీయ సుగంధ ద్రవ్యాలను తొలగించారు.

2018లో గోవాలో జరిగిన భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో కూడా, రష్యన్ చెఫ్‌లు హైదరాబాద్ హౌస్‌లోని వంటశాలలలో తమ స్టవ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. అక్టోబర్ 6, 2018న, ది హిందూ కథనం ప్రకారం, “రాష్ట్రపతి భవన్‌లో బిర్యానీ, గలోటీ కబాబ్‌లను తయారు చేశారు. కానీ పుతిన్ తన రష్యన్ సలాడ్, ట్వోరోగ్‌ను మాత్రమే తిన్నారు.

2022లో సమర్కండ్‌లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశం తర్వాత, ఉజ్బెక్ అధ్యక్షుడు మిర్జియోయెవ్ పుతిన్ చేత ప్లోవ్‌ను తినిపించడానికి ప్రయత్నించాడు. అందుకు పుతిన్ నిరాకరించాడు. “అధ్యక్షుడికి ప్రత్యేక ఆహార, భద్రతా నిబంధనలు ఉన్నాయి. మేము విదేశాలలో మా స్వంత ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తాము” అని రష్యా అధికారిక వర్గాలు వెల్లడించాయి.

అయితే మాజీ FSO అధికారి, ప్రస్తుత జర్నలిస్ట్ ఆండ్రీ సోల్డాటోవ్ తన “ది న్యూ నోబిలిటీ” పుస్తకంలో 2001 నుండి, పుతిన్ తన విదేశీ పర్యటనలలో “పోర్టబుల్ ఫుడ్ లాబొరేటరీ”ని వినియోగిస్తున్నారని రాశారు. ఈ ల్యాబ్ ప్రతి వంటకాన్ని స్పెక్ట్రోమీటర్, రసాయన పరీక్షలతో తనిఖీ చేస్తుంది. 2017లో ఫ్రాన్స్‌లోని వెర్సైల్లెస్ ప్యాలెస్‌లో కూడా ఇదే జరిగింది. ఫ్రెంచ్ చెఫ్‌లు క్రోసెంట్‌లు, ఫోయ్ గ్రాస్‌లను తయారు చేశారు. కానీ పుతిన్ తన సురిమి సూప్, ట్వోరోగ్‌లను మాత్రమే తిన్నారు.

పుతిన్ భద్రత దృష్ట్యా రష్యా, ఏ దేశాన్ని, అయా దేశాల చెఫ్‌లను నమ్మదు. రష్యా టుడేలో వచ్చిన ఒక కథనం ప్రకారం, పుతిన్ ఆహారం మాస్కో వెలుపల ఉన్న ఒక ప్రత్యేక పొలం నుండి వస్తుంది. అక్కడ పాలు పితికే ఆవులను 24 గంటలూ పర్యవేక్షిస్తారు. దీని అర్థం భారతీయ చెఫ్ తయారుచేసిన ఆహారం ఫోటోగ్రఫీకి కేవలం అలంకరణగా మిగిలిపోతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..