అదేమైనా ఎర్రబస్సా.. ఎయిర్‌బస్సా! ఎయిర్‌లైన్స్ ఆపరేటర్ల తీరు మారదా!
Ladies and gentlemen. The flight has been cancelled. We apologize for the inconvenience. ఇంగ్లీష్‌లో చెబితే చాలా అందంగా అనిపిస్తుంది గానీ.. దీన్నే తెలుగీకరించి చెప్పమంటే ఏం చెబుతారో తెలుసా. 'మా విమానం రద్దయింది.. మీ చావు మీరు చావండి' అని. ఫ్లైట్ క్యాన్సిల్ అయిన ప్యాసెంజర్లకు ఎయిర్‌లైన్స్ ఆపరేటర్లు చెప్పే సమాధానం ఇలాగే ఉంటుంది. అరె.. ఓవైపు విమానయానానికి డిమాండ్ పెరుగుతోంది, ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువవుతోంది, కావాల్సినంత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అవసరానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు టెక్నాలజీ కూడా అప్‌గ్రేడ్ అవుతూనే ఉంది. మరి.. లేనిదేంటి? ప్రొఫెషనలిజం. ఎయిర్‌లైన్స్ ఆపరేటర్లకు లేనిదల్లా భయం, భక్తి, బాధ్యత. 'ఎట్ ఎనీ సిచ్యుయేషన్, ఎట్ ఎనీ కాస్ట్.. మనం ఈ ఫ్లైట్‌ను ఆలస్యంగా పంపకూడదు, ఫ్లైట్ క్యాన్సిల్ అనే అనౌన్స్‌మెంటే వినిపించకూడదు' అనే కమిట్‌మెంట్ కనిపించడం లేదు. టికెట్ రేట్లు పెంచుతారు, ఎక్స్‌ట్రా కన్వీనియెన్స్ కోసం ఎక్స్‌ట్రా ఫీజు గుంజుతారు, లాభాలు గడిస్తారు. ప్యాసెంజర్లను మాత్రం టైమ్‌కి గమ్యస్థానానికి పంపించరు. 'Flight Delayed, Flight Cancelled'.. అని ఇంకెన్నాళ్లు చెబుతారు? ఎయిర్‌లైన్స్ ఆపరేటర్లు ఇక మారరా? ప్రొఫెషనలిజం నేర్చుకోరా? రోజురోజుకూ సింప్లిఫై చేసుకోవాల్సిన సిస్టమ్‌ని.. మరింత కాంప్లికేట్ ఎందుకు చేస్తున్నారు? ఈ టాపిక్‌పై కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫ్యాక్టర్స్ చెప్పుకుందాం...

ఫ్లైట్ క్యాన్సిల్ అనేది చాలా పెద్ద ఇష్యూ. ‘ఏముంది… మరో ఫ్లైట్ పట్టుకుంటారు, లేదా జర్నీ క్యాన్సిల్ చేసుకుని ఇంటికొచ్చేస్తారు’ అనుకుంటారు. కాదు…! హైదరాబాద్, ముంబై, ఢిల్లీ.. ఇలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ నుంచి వెళ్లే ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే… కొన్ని వందల మంది ఫారెన్ టూర్ క్యాన్సిల్ అయినట్టే. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్.. ఇలాంటి దేశాలకు కనెక్టింగ్ ఫ్లైట్స్ ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ నుంచే ఉంటాయ్. వేలకు వేల, లక్షల రూపాయలు పోసి కనెక్టింగ్ ఫ్లైట్ టికెట్లు కొనుక్కుని ఉంటారు. వాళ్లంతా లాస్ అయినట్టే కదా. పైకి మాత్రం హైదరాబాద్ వెళ్లే విమానం క్యాన్సిల్ అయింది, ముంబై వెళ్లే ఫ్లైట్ లేట్ అయింది అనే కనిపిస్తుంది గానీ… ఇదంతా దేశ ఆర్థిక వ్యవస్థ, వరల్డ్ ఎకానమీపై ఎఫెక్ట్ చూపిస్తుంది. అచ్చంగా బటర్ ఫ్లై ఎఫెక్ట్‌లాగా. ఏ ఒక్కచోట ఫ్లైట్ లేట్ or క్యాన్సిల్ అయినా.. అది భారీ నష్టాన్ని కలిగిస్తుంది. అయినా సరే ఎయిర్‌లైన్స్ తీరు ఎందుకు మారట్లేదు? ఇండిగో సర్వీస్ అంటేనే ఇలా ఉంటుందేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. లేకపోతే.. ఒకట్రెండు ఫ్లైట్లు రద్దవడం చూశాం గానీ.. మరీ వందల కొద్దీనా? నవంబర్ నెలలో అయితే.. ఏకంగా 1232 సర్వీసులు క్యాన్సిల్ చేసింది ఇండిగో. డిసెంబర్ మొదలై రెండ్రోజులైందో లేదో మళ్లీ వందల కొద్దీ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. మొన్న మంగళవారం నాడు 1400లకు పైగా సర్వీసులను ఆలస్యంగా నడిపింది. ఎంతకీ ‘మీకు...




