Srilanka: కిలో పచ్చిమిర్చి రూ.710, టమోటా 200.. దివాళా అంచున శ్రీలంక..

Srilanka: శ్రీలంకలో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర ధరలు పెరగడంతో అడుగడుగన అవస్థలు పడుతున్నారు. శ్రీలంకను

Srilanka: కిలో పచ్చిమిర్చి రూ.710, టమోటా 200.. దివాళా అంచున శ్రీలంక..
Sri Lanka
Follow us
uppula Raju

|

Updated on: Jan 14, 2022 | 8:46 AM

Srilanka: శ్రీలంకలో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర ధరలు పెరగడంతో అడుగడుగన అవస్థలు పడుతున్నారు. శ్రీలంకను డిఫాల్టర్‌గా ప్రకటించాలా లేక కొంత సమయం ఇవ్వాలా అనేది వచ్చే వారంలో తేలుతుంది. వాస్తవానికి 2022 సంవత్సరంలో శ్రీలంక అనేక రకాల రుణాలను తిరిగి చెల్లించాలి. కానీ ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. దీనికి తోడు కోవిడ్, దిగుమతి బిల్లుల పెరుగుదల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరుకుంది. శ్రీలంక ప్రభుత్వం జనవరి 2022లో అంతర్జాతీయ సావరిన్ బాండ్లలో 500 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఆ తర్వాత జులై 2022లో కూడా మరో బిలియన్ డాలర్ల అంతర్జాతీయ సావరిన్ బాండ్ చెల్లించాల్సి ఉంటుంది. వీలైతే డిఫాల్టర్‌గా ప్రకటించే అవకాశం ఉంది.

పెరిగిన ద్రవ్యోల్బణం వల్ల శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. కిలో పచ్చిమిర్చి రూ.710, బీన్స్ రూ.320, క్యారెట్ రూ.200, పచ్చి అరటి రూ.120, బెండ రూ.200, టమాట రూ.200కు వ్యాపారులు అమ్ముతున్నారు. బంగాళదుంప కిలో 200 రూపాయలు పలుకుతోంది. పాలపొడి దాదాపు 13 శాతం ఖరీదుగా మారింది. ఆహారం, పానీయాల ధరలు నెలలో 15 శాతం పెరిగాయి. కేవలం 4 నెలల్లోనే LPG ధర 80 శాతం పెరిగింది. బియ్యం, పిండి కిలో 100 నుంచి 150 రూపాయలకు చేరుకుంది. కొబ్బరి నూనె 750 ml కు 450 నుంచి 500 రూపాయలు, పప్పులు 250 నుంచి 300 రూపాయల వరకు చేరాయి. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీలంకలోని 5 లక్షల మందికి పైగా ప్రజలు దారిద్య్రరేఖకు దిగువకు చేరుకోవచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

కరోనా సంక్షోభం, ముడి చమురు ధరల పెరుగుదల, శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా దేశంలో పరిస్థితి దిగజారింది. మేలో దేశంలోని వ్యవసాయ రంగాన్ని 100 శాతం సేంద్రీయంగా మార్చడానికి రసాయన ఎరువుల దిగుమతులపై నిషేధం విధించాలని అధ్యక్షుడు రాజపక్సే ఆదేశించారు. దీని వల్ల రైతులకు పెరగడంతో పాటు ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. ఈ కారణంగా ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ రైతులు వ్యవసాయాన్ని నిలిపివేశారు. ఇటీవలి వారాల్లో కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు ప్రభుత్వం సడలింపు ప్రకటించింది. కానీ దిగుమతులపై ప్రభావం కారణంగా ధరలు హద్దులు లేకుండా మారాయి.

WHO గుడ్‌న్యూస్.. మరో రెండు కొత్త కరోనా మందులకు ఆమోదం.. అవేంటంటే..?

Corona: కరోనా టెర్రర్‌.. ఢిల్లీ, ముంబైలలో త్వరలో పీక్ స్టేజ్..! 8 రోజులుగా దేశంలో రోజుకు లక్షకు పైగా కొత్త కేసులు..

Silver Price Today: భారీగా పెరిగిన వెండి ధరలు.. హైదారాబాద్‌లో కిలో సిల్వర్ రేట్‌ ఎంతంటే..?