AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video:ఓ టీచర్ కొంప ముంచిన వైరల్ వీడియో.. అటు ఉద్యోగం పాయే.. ఇటు భర్త వద్దనబట్టే.. ఇంతకీ ఏమైందంటే..

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. ఓ టీచర్ భవితవ్యాన్ని అగమ్యగోచరం చేసింది. ఇటు బతుకు బరోసా అయిన టీచర్ ఉద్యోగం పోగా..

Viral Video:ఓ టీచర్ కొంప ముంచిన వైరల్ వీడియో.. అటు ఉద్యోగం పాయే.. ఇటు భర్త వద్దనబట్టే.. ఇంతకీ ఏమైందంటే..
Shiva Prajapati
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 14, 2022 | 3:36 PM

Share

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో.. ఓ టీచర్ భవితవ్యాన్ని అగమ్యగోచరం చేసింది. ఇటు బతుకు బరోసా అయిన టీచర్ ఉద్యోగం పోగా.. అటు కట్టుకున్న భర్త నువ్ నాకొద్దంటూ ఏకంగా డైవర్స్ ఇచ్చేశాడు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.. ఈజిప్ట్‌కు చెందిన అయా యూసఫ్ అనే టీచర్ తన సహోద్యోగులతో కలిసి నైలు నదిపై పడవలో విహార యాత్రకు వెళ్లింది. ఆ సందర్భంగా తన సహచరులతో కలిసి సరదాగా బెల్లీ డ్యాన్స్ వేసింది. అదే ఆమె పాలిట శాపంలా మారింది. ఆమె బెల్లీ డ్యాన్స్‌ చేస్తుండగా.. సహోద్యోగి ఆ సన్నివేశాన్ని వీడియో తీశారు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. మహిళలు బహిరంగంగా డ్యాన్స్ వేయడంపై అక్కడి ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పించారు.

అయితే, ఈ వీడియో అది ఇటు తిరిగి, ఇటు తిరిగి పాఠశాల అధికారుల కంట పడటంతో.. వారు సీరియస్ అయ్యారు. ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ షాక్ ఇలా ఉండగానే.. ఆమె భర్త మరో ఊహించని షాక్ ఇచ్చాడు. డ్యాన్స్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు. ఈ పరిణామాలతో ఆమెకు తీవ్ర మనోవేదనకు గురైంది. సహోద్యోగి తన అనుమతి లేకుండా వీడియో చిత్రీకరించాడని యూసఫ్ ఆరోపించింది. నైలు నదిలో పది నిమిషాల ప్రయాణం నా జీవితాన్నే అస్తవ్యస్థం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తానేం బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ చేయలేని వివరణ ఇచ్చుకుంది.

అయితే, టీచర్‌ వ్యవహారంలో అధికారులు తీసుకున్న నిర్ణయంపై మెజార్టీ ఈజిప్షియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఏ కాలంలో ఉన్నారంటూ దుమ్మెత్తిపోతున్నారు. ఆమె ఉద్యోగం ఆమెకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యూసఫ్‌కు మద్ధతుగా ఈజిప్షయన్ మహిళలు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదిలాఉంటే.. మహిళ అనుమతి లేకుండా ఆమె వీడియో చిత్రీకరించి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధిత టీచర్ సహా, ఈజిప్షయన్లు డిమాండ్ చేస్తున్నారు.

Also read: Ram Charan: ‘డ్రైవింగ్ లైసెన్స్’ తీసుకొని చాలా కాలమే అయినా.. ఇప్పుడు ఆ ఊసే లేదే..?

Watch Video: వాట్ ఏ క్యాచ్.. షాకైన పుజారా.. చిరుత లాంటి ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న సౌతాఫ్రికా ప్లేయర్..!

UP Assembly Election 2022: సమాజ్ వాదీ పార్టీకి భారీ షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ నాయకుడు..

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..