Watch Video: వాట్ ఏ క్యాచ్.. షాకైన పుజారా.. చిరుత లాంటి ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న సౌతాఫ్రికా ప్లేయర్..!

IND vs SA 3rd Test: ఛెతేశ్వర్ పుజారా నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించారు. కానీ, కీగన్ పీటర్సన్ చురుకైన ఫీల్డింగ్ కారణంగా అది జరగలేదు.

Watch Video: వాట్ ఏ క్యాచ్.. షాకైన పుజారా.. చిరుత లాంటి ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్న సౌతాఫ్రికా ప్లేయర్..!
Ind Vs Sa 3rd Test Pujara Out
Follow us
Venkata Chari

|

Updated on: Jan 13, 2022 | 3:26 PM

India Vs South Africa 2021: భారత్-దక్షిణాఫ్రికా(India Vs South Africa) జట్ల మధ్య జరుగుతున్న కేప్ టౌన్ టెస్టు(Cape Town Test)లో , రెండో ఇన్నింగ్స్‌లో చెతేశ్వర్ పుజారా(Cheteshwar Pujara) తీవ్రంగా నిరాశపరిచాడు. ప్రోటీస్ జట్టుకు చెందిన కీగన్ పీటర్సన్ చిరుత లాంటి ఫీల్డింగ్ బలయ్యాడు. మూడో రోజు ఆట మొదలైన రెండో బంతికే పెవిలియన్ చేరి నిరాశ పరిచాడు. మూడో టెస్టు మూడో రోజు ఆటలో రెండో బంతికే మార్కో యాన్సన్‌ బౌలింగ్‌లో చెతేశ్వర్ పుజారా అవుటయ్యాడు. కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసి పెవిలయన్ చేరాడు. దీంతో భారత్ పరిస్థితి మరింత దిగజారడంతో పాటు భారీ స్కోరుపై ఆశలు అడియాసలయ్యాయి. లెగ్ స్లిప్‌లో నిలబడి చెతేశ్వర్ పుజారా క్యాచ్‌ని కీగన్ పీటర్సన్ అందుకున్నాడు. అతని క్యాచ్ చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. పుజారా కూడా ఇలా ఔట్ అయ్యాడంటే నమ్మలేకపోయాడు.

మూడో రోజు ఆటను చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ ప్రారంభించారు. ఇద్దరూ రెండో రోజు ఆటను ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధించారు. రెండో రోజు సాయంత్రం వరకు వీరిద్దరూ రాణించడంతో, మూడో రోజు కూడా అదే జరుగుతుందని అంతా భావించారు. అయితే రెండో బంతికే భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మార్కో యాన్సన్ బంతిని షార్ట్ పిచ్‌లో ఆడాడు. బంతి చాలా జంప్ చేసి లెగ్ సైడ్ కి వెళ్లింది. బంతి వేగం, బౌన్స్ పుజారాను ఆశ్చర్యపరిచాయి. పుజారా చేతికి తగిలిన బంతి లెగ్ స్లిప్ వైపు వెళ్లింది. ఇక్కడ నిలబడిన కీగన్ పీటర్సన్ కుడివైపుకు దూకి క్యాచ్ పట్టాడు.

ఆ వెంటనే రహెనే(1) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ భారీ స్కోర్ ఆశలకు బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం భారమంతా విరాట్ కోహ్లీ(17), పంత్ (25) పైనే నిలిచాయి. ప్రస్తుతం భారత్ 4 వికెట్లు నష్టపోయి 90 పరుగులు చేసింది. 103 పరుగల ఆధిక్యంలో నిలిచింది.

Also Read: IPL 2022: బీసీసీఐ ‘ప్లాన్ బీ’లో మిస్సయిన యూఏఈ.. ఐపీఎల్ 2022 నిర్వహించేది ఎక్కడంటే?

IND vs SA, 3rd Test, Day 3, LIVE Score: 100 పరుగులు దాటిన భారత్ ఆధిక్యం.. భారమంతా కోహ్లీ, పంత్ పైనే..!