IPL 2022: బీసీసీఐ ‘ప్లాన్ బీ’లో మిస్సయిన యూఏఈ.. ఐపీఎల్ 2022 నిర్వహించేది ఎక్కడంటే?
IPL Mega Auction: భారతదేశంలో కరోనాకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా క్షీణిస్తున్న పరిస్థితుల్లో బీసీసీఐ పలు క్రికెట్ ఈవెంట్‌లకు యూఏఈ మొదటి ఎంపికగా నిలుస్తోంది.
BCCI’s Plan B for IPL 2022: ఐపీఎల్ కొత్త సీజన్ రాబోతోంది. కానీ, కరోనా (Covid -19) కూడా మరోసారి తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ఇది దేశవ్యాప్తంగా ప్రతిరోజూ తన పరిధిని పెంచుకుంటోంది. దాని విధ్వంసానికి ప్రజలను బాధితులుగా మారుస్తోంది. మధ్యలో భారత్‌లో నిర్వహించిన లీగ్‌కి గత సీజన్‌లో కరోనా ఎలా బ్రేకులు వేసిందో తెలిసిందే. దీంతో మిగిలిన మ్యాచ్‌ల కోసం బీసీసీఐ యూఏఈకి వెళ్లాల్సి వచ్చింది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, ఇప్పుడు ఐపీఎల్ (IPL 2022) 15వ సీజన్‌లో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే ప్లాన్ బీపై పని చేస్తోంది.
భారతదేశం ఏప్రిల్ నాటికి కరోనా వేగాన్ని ఆపకపోతే, బీసీసీఐ ఈ రిచ్ లీగ్‌ను విదేశాల్లో నిర్విహించే ఛాన్స్ ఉంది. అయితే ఈ సారి మాత్రం యూఏఈలో నిర్వహించకూదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి బీసీసీఐ ప్లాన్ బీలో ముందుకొస్తున్న రెండు దేశాల్లో ఒకటి దక్షిణాఫ్రికా కాగా, మరొకటి శ్రీలంక. 2009లో ఒకసారి బీసీసీఐ టీ20 లీగ్‌ని నిర్వహించిన అనుభవం దక్షిణాఫ్రికాకు ఉంది.
యూఏఈను లిస్టు నుంచి తొలగించిందా.. భారతదేశంలో కరోనాకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా క్షీణిస్తున్న పరిస్థితుల్లో బీసీసీఐ ఐపీఎల్ ఈవెంట్‌ను యూఏఈలో నిర్వహించేందుకు మొదటి ఎంపికగా ఎంచుకునేది. అక్కడ ఇప్పటికే IPL 2021 రెండవ అర్ధభాగం నిర్వహించింది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ 2021 కూడా అక్కడే నిర్వహించారు. కానీ, ప్రస్తుతం బీసీసీఐ యూఏఈ వేదికను మార్చాలని ప్లాన్ చేస్తోంది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, బీసీసీఐ అధికారి మాట్లాడుతూ, “మేం అన్ని సమయాలలో యూఏఈపై మాత్రమే ఆధారపడలేం. మేం ఇతర ఎంపికలను కనుగొనవలసి ఉంటుంది. దక్షిణాఫ్రికా, భారత్ మధ్య సమయ వ్యత్యాసం ఆటగాళ్లకు, క్రికెట్ అభిమానులకు కూడా చాలా సరిపోతుంది.
దక్షిణాఫ్రికా సరైన ఎంపిక.. దక్షిణాఫ్రికా సమయం కంటే భారత్ 3 గంటల 30 నిమిషాలు ముందుంది. అంటే మొదటి మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు దక్షిణాఫ్రికాలో ప్రారంభం చేస్తే, అది భారతదేశంలో రాత్రి 7:30లకు ప్రారభమవుతుంది. ఇది ప్రసార సమయాన్ని ప్రభావితం చేయదు. అక్కడ మ్యాచ్ కూడా సరైన సమయంలో ముగుస్తుంది. దీని కారణంగా ఆటగాళ్లకు కూడా విశ్రాంతి లభిస్తుంది.
IPL 2022 కోసం BCCI ప్లాన్ బీలో దక్షిణాఫ్రికా పేరు కూడా ముందంజలో ఉంది. ఎందుకంటే ఇటీవలి సిరీస్ అక్కడ విజయవంతంగా ముగిసింది. అది భారత్ ఏ జట్టు పర్యటన అయినా లేదా సీనియర్ జట్టు మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగింది. ఈ రెండు సిరీస్‌ల విజయంతో బీసీసీఐ యూఏఈ కాకుండా దక్షిణాఫ్రికా గురించి ఆలోచించాల్సి వచ్చింది.
టీమిండియా సౌతాఫ్రికా టూర్ ప్రారంభం కానున్న తరుణంలో, అక్కడ పెరుగుతున్న ఒమిక్రాన్ కేసుల కారణంగా, సిరీస్ గురించి చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ, సిరీస్ ప్రారంభమైనప్పుడు, Omicron ఆటపై ఎటువంటి ప్రభావం చూపలేదు. భారత్‌కు దక్షిణాఫ్రికా విజయవంతంగా ఆతిథ్యమిచ్చింది. ప్రస్తుతం అక్కడ Omicron కేసులు రోజురోజుకు తగ్గుతున్నాయి.
Pushpa: మళ్లీ పుష్పరాజ్‌గా మారిన టీమిండియా క్రికెటర్.. ఈసారి ఏకంగా నోట్లో బీడీ పెట్టుకుని..