AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: మళ్లీ పుష్పరాజ్‌గా మారిన టీమిండియా క్రికెటర్‌.. ఈసారి ఏకంగా నోట్లో బీడీ పెట్టుకుని..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌ లో వచ్చిన మొదటి పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప- దిరైజ్‌'. గతేడాది డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది

Pushpa: మళ్లీ పుష్పరాజ్‌గా మారిన టీమిండియా క్రికెటర్‌.. ఈసారి ఏకంగా నోట్లో బీడీ పెట్టుకుని..
Basha Shek
|

Updated on: Jan 13, 2022 | 8:03 AM

Share

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌ లో వచ్చిన మొదటి పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప- దిరైజ్‌’. గతేడాది డిసెంబర్‌ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దక్షిణాధి భాషల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ భారీ కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఓటీటీలో విడుదలైనా, కరోనా ఆంక్షలు అమలవుతున్నా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్ల వర్షం రాబడుతోందంటే ఈసినిమా ఎంతటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అర్థం చేసుకోవచ్చు. కాగా ఈ సినిమాలో బన్నీ చెప్పిన కొన్ని డైలాగులు బాగా పేలాయి. ఎంతలా అంటే ప్రముఖ క్రికెటర్లు ఈ సినిమాలోని డైలాగులను రీక్రియేట్‌ చేసేంత. ఇటీవల ఆసీస్‌ క్రికెట్‌ డేవిడ్‌ వార్నర్‌, టీమిండియా క్రికెటర్లు రవీంద్ర జడేజా, శిఖర్‌ ధావన్‌ ‘పుష్ప’ రాజ్ డైలాగ్‌లను తమదైన శైలిలో అనుకరించి ఆకట్టుకున్నారు.

ఊరమాస్‌ లుక్‌లో.. కాగా ఈ సినిమాలోని ‘తగ్గేదేలే’ డైలాగ్ చెప్పి బన్నీ అభిమానులను ఫిదా చేశాడు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. తాజాగా ఈ క్రికెటర్‌ మళ్లీ పుష్పరాజ్‌గా మారాడు. సినిమాలోని అల్లు అర్జున్ ఊర మాస్ లుక్‌ను రీక్రియేట్ చేశాడు. ఇందులో లారీ డ్రైవర్‌ పాత్ర పోషించిన బన్నీ మాసిన గడ్డం.. జులపాల జుట్టుతో ఊరమాస్‌లుక్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే స్టైల్ ను జడేజా అనుకరించాడు. బన్నీలాగానే మాసిన గడ్డం, జులపాల జుట్టుతో పాటు ఏకంగా నొట్లో బీడీ పెట్టుకొని మాస్ లుక్ ఇచ్చాడు. ఈ సందర్భంగా బన్నీ ఫొటోతో పాటు తన ఫొటోనూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దీనికి ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైరూ’ అనే డైలాగ్‌ను క్యాప్షన్‌గా ఇచ్చాడు.

బీడీ, పొగాకు ఆరోగ్యానికి హానికరం.. అయితే ఇందులోని నోట్లో పెట్టుకున్న బీడీ పూర్తిగా పూర్తిగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అని జడేజా పేర్కొన్నాడు. అంతేకాదు బీడీ, పొగాకు ఆరోగ్యానికి హానికరమని, క్యాన్సర్ వస్తుందని ఫ్యాన్స్‌ను హెచ్చరించాడు. ఈ ఫొటో కోసం తాను బీడీ తాగలేదని, ఎవరూ కూడా తాగవద్దని సూచించాడు. కాగా ప్రస్తుతం జడేజా ఊర మాస్ లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ అయితే సంతోషంతో మురిసిపోతున్నారు.

Also Read:

Vaikunta Ekadasi: తిరుమలలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్న సీజే ఎన్వీ రమణ..

Omicron Variant: ఒమిక్రాన్ విరుచుకుపడుతున్న వేళలో చిన్నారుల విషయంలో టెన్షన్ వద్దు.. జాగ్రత్తలే ముద్దు!

UP Elections 2022: బీజేపీలో కొలిక్కివస్తున్న అభ్యర్థుల ఎంపిక.. సీఎం యోగి ఎక్కడి నుంచంటే..?