Avatar 2: అవతార్ 2 వచ్చేస్తుంది.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్..

హాలీవుడ్ చిత్రాలకు మన దేశంలో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు విడుదలైన సినిమాలు మంచి

Avatar 2: అవతార్ 2 వచ్చేస్తుంది.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్..
Avatar 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 13, 2022 | 10:02 AM

హాలీవుడ్ చిత్రాలకు మన దేశంలో ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు విడుదలైన సినిమాలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇటీవల విడుదలైన స్పైడర్ మ్యాన్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పటివరకు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతులను ఇచ్చిన చిత్రాలలో అవతార్ (Avatar) ఒకటి. వరల్డ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తన అద్బుతమైన క్రియేటివిటితో ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లారు అనడంలో సందేహం లేదు. అవతార్ సినిమా విడుదలైన సమయంలోనే దీనికి సిక్వెల్ ఉంటుందని ప్రకటించారు మేకర్స్. దీంతో అవతార్ సెకండ్ పార్ట్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అవతార్ 2 విడుదల తేదీని ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 16న విడుదల చేయబోతున్నారు.

ఈ మూవీకి సంబంధించిన నాలుగు పార్ట్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. గతంలో వచ్చిన అవతార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కలెక్షన్స్ పరంగా ఈ మూవీ సంచలనం సృష్టించింది. ఆ సమయంలోనే అవతార్ సిక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.. కానీ కరోనా ప్రభావంతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమా సెకండ్ సిక్వెల్ ను 2024లో డిసెంబర్ లో.. మూడవ సీక్వెల్ డిసెంబర్ 2026లో.. నాల్గవ సీక్వెల్ 2028 విడుదల చేయాలని భావిస్తున్నారట. అంతేకాకుండా ఈ సీక్వెల్స్ లలో కొత్త నటీనటులు యాడ్ కాబోతున్నారు. ఈ ఏడాది సరికొత్తగా అవతార్ 2 రాబోతుందని తెలిపారు మేకర్స్.

Also Read: Pooja Hegde: బుట్ట‌బొమ్మ స్టెప్‌ను సృష్టించింది తామే అంటోన్న పూజా.. అర్హ‌తో ఆస‌క్తిక‌ర‌మైన వీడియో..

Teaser Talk: అస‌లు మ‌నిషి చ‌ర్మంతో వ్యాపారం ఏంటి..? ఆసక్తిరేపుతోన్న హ‌న్సిక కొత్త సినిమా టీజ‌ర్‌..

Nidhi Agarwal : అందాల నిధికి కాబోయేవాడికి ఆ క్వాలిటీస్ ఉండాలట.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అమ్మడు

Bhamakalapam: ఆకట్టుకుంటున్న ప్రియమణి న్యూలుక్.. ఆహాలో రాబోతున్న భామా కలాపం..