Vaikunta Ekadasi: తిరుమలలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్న సీజే ఎన్వీ రమణ..

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. బుధవారం అర్ధరాత్రి 12.05 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు

Vaikunta Ekadasi: తిరుమలలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్న సీజే ఎన్వీ రమణ..
Tirumala
Follow us
Basha Shek

|

Updated on: Jan 13, 2022 | 7:25 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. బుధవారం అర్ధరాత్రి 12.05 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ధనుర్మాస పూజలు నిర్వహించారు. అనంతరం1.45 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి అనుమతిచ్చారు. కాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సతీమణితో కలిసి వైకుంఠ ద్వారం గుండా ఆలయ ప్రదక్షిణ చేసిన ఆయన ఏకాంత సేవలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమలకు చేరుకున్న సీజేకు పద్మావతి అతిథి గృహం వద్ద పుష్పగుచ్ఛంతో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్‌ జెట్టి తదితరులు స్వాగతం పలికారు.

శ్రీవారి సేవలో ప్రముఖులు.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులతో పాటు సుప్రీం కోర్టు మరో న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, కర్ణాటక హైకోర్టు జస్టిస్ రితురాజ్ అవస్థి, త్రిపుర హైకోర్టు సీజే అమర్‌నాథ్‌ గౌడ్‌, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఈశ్వరయ్య, జస్టిస్‌ కృష్ణమోహన్‌, జస్టిస్‌ దుర్గా ప్రసాద్‌, జస్టిస్‌ రమేశ్‌ తదితర న్యాయమూర్తులు వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు.

ఇక ఏపీ మంత్రులు నారాయణస్వామి, మేకపాటి గౌతమ్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరామ్, అనిల్ కుమార్ యాదవ్, సీదిరి అప్పల్రాజు, అవంతి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీలు మార్గాని భరత్, కొత్త ప్రభాకర్, వెంకటేష్, ఎం.సత్యవతి, ఎమ్మెల్యేలు రోజా, శిల్పాచక్రపాణి రెడ్డి, బీజేసీ ఎంపీ సీఎం రమేశ్‌ దంపతులు, మాజీ మంత్రి చినరాజప్ప, లక్ష్మీ పార్వతి, తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌ స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.

Also Read:

UP Elections: యూపీలో పెరుగుతున్న జంపింగ్ జపాంగ్‌లు.. బీజేపీకి మరో మంత్రి రాంరాం!

Horoscope Today: ఈ రాశుల వారికి కొన్ని విషయాలు నిరుత్సాహ పరుస్తాయి..!

Bhamakalapam: ఆకట్టుకుంటున్న ప్రియమణి న్యూలుక్.. ఆహాలో రాబోతున్న భామా కలాపం..