UP Elections: యూపీలో పెరుగుతున్న జంపింగ్ జపాంగ్‌లు.. బీజేపీకి మరో మంత్రి రాంరాం!
Uttar Pradesh Politics: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎలక్షన్స్ దగ్గరపడుతున్న కొద్దీ జంపింగ్‌ల సంఖ్య పెరుగుతోంది.

Uttar Pradesh Assembly Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఎలక్షన్స్ దగ్గరపడుతున్న కొద్దీ జంపింగ్‌ల సంఖ్య పెరుగుతోంది. జంపింగ్ జపాంగ్‌లపై భారతీయ జనతా పార్టీ (BJP) అధిష్టానం పోస్టుమార్టం మొదలు పెట్టింది. మొన్ననే పార్టీ మారి బీజేపీకి షాక్ ఇచ్చారు కేబినెట్ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య(Swami Prasad Mourya). ఆయనే కాదు, ఇంకో నలుగురు ఎమ్మెల్యేలను తనతోపాటు తీసుకెళ్లి అఖిలేశ్ యాదవ్(Akhilesh Yadav) పంచన చేరారు స్వామి ప్రసాద్. తాజాగా మరో మంత్రి ధారా సింగ్ చౌహాన్(Dara Singh Chauhan) రాజీనామా చేశారు.
అయితే, వీరు పార్టీ మారడంపై భిన్నంగా స్పందిస్తున్నారు బీజేపీ నేతలు. స్వామి ప్రసాద్ మౌర్య ఎందుకు పార్టీని వీడారో తెలియడం లేదని అంటున్నారు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య. పార్టీని వీడద్దని, చర్చిద్దాం రండి అని, తొందరపాటు నిర్ణయాలు మంచివికావని సూచించారు కేశవ్ ప్రసాద్ మౌర్య. సీఎం యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంపై యూపీ బీజేపీలో అసంతృప్తి ఉందని ఇప్పటికే బహిరంగంగానే చెప్పారు సొంతపార్టీ నాయకులు. ఇప్పుడు తాజాగా రాజీనామాలతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
రెండు నెలల ముందే యోగి ఆదిత్యనాథ్ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మౌర్య ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కానీ దాన్ని అధిష్ఠానం పెద్దగా పట్టించుకోలేదని అంటున్నారు కాషాయ పార్టీ నేతలు. ఇప్పుడు స్వామి మౌర్యతో పాటు రాజీనామా చేసిన మరో నలుగురు ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యను డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు అమిత్ షా అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయం గురించి కేశవ్ ప్రసాద్ మౌర్య ముందే ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నిస్తున్నారు స్వామి ప్రసాద్ మౌర్య. మొత్తానికి యూపీలో రసవత్తరంగా మారాయి రాజకీయాలు.
Read Also…. Viral Video: అచ్చం చెక్క ముక్కలా కనిపిస్తున్న ఇది ఏంటో తెలుసా..? మీ కళ్ళను మీరే నమ్మలేరు..(వైరల్ వీడియో)