29 April 2025
Subhash
లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ (LIC) వినియోగదారుల కోసం ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. ఇందులో మంచి ఆదాయం పొందే స్కీమ్స్ కూడా ఉన్నాయి.
ఎల్‌ఐసీలో అటువంటి పథకం గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రతి యేటా రూ.72000 వరకు డిపాజిట్ చేస్తే రూ.28 లక్షల వరకు పొందే అవకాశం ఉంటుంది.
ఎల్‌ఐసీ అందిస్తున్న పథకాల్లో ఎండోమెంట్ పథకం ఒకటి. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ఈ ఎండోమెంట్ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 8 నుంచి 55 సంవత్సరాల వయస్సు ఉన్న వారు పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ ఎండోమెంట్ ప్లాన్‌లో మీరు 12 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది.
మీరు 30 సంవత్సరాల వయస్సులో 25 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తే మీరు 25 సంవత్సరాలలో మొత్తం రూ.18 లక్షలు ఆదా చేస్తారని గుర్తించుకోండి.
ఈ ఎండోమెంట్ పథకంలో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రస్తుతానికి మీకు రూ.7 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు బోనస్ లభిస్తుంది.
ఇదే సమయంలో మీకు తుది అదనపు బోనస్ రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల రూపాయల మధ్య ఉంటుంది.
ఈ పథకంలో మీకు మొత్తం అన్నీ కలిపి రూ.25 లక్షల నుంచి రూ.28 లక్షల వరకు పొందవచ్చు. ఇది మీకు అవగాహన కోసం మాత్రమే మరిన్ని వివరాల కోసం ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సందర్శించవచ్చు.