అక్షయతృతీయ రోజు అదృష్టం కలిసిరావాలంటే.. 12 రాశుల వారు ఏం చేయాలో తెలుసా?

samatha 

29 April 2025

Credit: Instagram

2025 సంవత్సరంలో అక్షయ తృతీయ అనేది ఏప్రిల్ 30, 2025న వస్తుంది. ఈరోజు 12 రాశుల వారు ఈ పరిహారాలు చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందంట.

మేషరాశి వారు అక్షయతృతీయ రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, అలాగే రాగి నాణెంను నీటిలో వేయడం వలన వీరికి అదృష్టం కలిసివస్తుంది.

అక్షయతృతీయ రోజున వృషభ రాశి వారు లక్ష్మీ దేవికి గులాబీ పువ్వులు సమర్పించి, పూజ చేయడం వలన వీరికి ఈ సంవత్సరం అంతా బాగుంటుందంట.

మిథున రాశి వారు అక్షయ తృతీయ రోజున శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయడమే కాకుండా, వీరు  పక్షులకు ధాన్యాలు తినిపించడం వలన సంవత్సరం అంతా బాగుంటుంది.

కర్కాటక రాశి వారు శివాభిషేకం, వెండి దానం చేయాలి. సింహ రాశి వారు సూర్యుడికి నీరు అర్పించడం వలన కలిసి వస్తుందంట.

కన్యా రాశి వారు తులసి మొక్కను సేవించి,పెసరప్పుదానం చేయాలంట. అలాగే తుల రాశి వారు లక్ష్మీదేవిని గులాబీలతో పూజించాలంట.

వృశ్చిక రాశి వారు నల్ల నువ్వులను దానం చేయడమే కాకుండా, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి, ధనస్సురాశి వారు అరటి చెట్టును పూజించి పసుపు రంగు దుస్తులు ధరించాలి.

మకర రాశి వారు శనిదేవుడిని పూజించి నల్లటి వస్త్రాలను దానం చేయాలి.నీలిరంగు దుస్తులు ధరించండి.మీన రాశివారు విష్ణువును పసుపు పువ్వులతో పూజించండి.