ఇంట్లో ఎంత డబ్బు పెట్టుకోవచ్చు ? ఇన్కం ట్యాక్స్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
డిజిటల్ లావాదేవీలు పెరిగిన పోయిన ఈ రోజుల్లోనూ ఇప్పటికీ డబ్బును ఇంట్లో దాచుకునేవారు కొందరు ఉన్నారు. రోజువారీ ఖర్చులు, అత్యవసరం కోసమంటూ నగదు నిల్వ ఉంచుకుంటారు. నిజానికి పెద్ద మొత్తంలో డబ్బు ఇంట్లో దాచుకోవడం సరికాదు. ఒక్కోసారి ఇంట్లో భారీగా నగదు దాచుకుంటే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఆ డబ్బు మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇన్కం ట్యాక్స్ తనిఖీల సమయంలో ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు దొరికితే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
ఇంతకీ ఇంట్లో ఎంత నగదు దాచుకోవచ్చు. ఐటీ రూల్స్ ఏం చెబుతున్నాయి.? పన్ను ఎగవేత, బ్లాక్ మనీని నిరోధించేందుకు నగదు విషయంలో ఆదాయపు పన్ను శాఖ కొన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇంట్లో డబ్బు ఉంచడం, దాచడంపై కొన్ని పరిమితులు విధించింది. నిజానికి ఇంట్లో ఎంత మొత్తం నగదైనా దాచుకోవచ్చు. దానికంటూ ఓ పరిమితి లేదు. కానీ సోదాలు నిర్వహించినప్పుడు ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు దొరికితే ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పే ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. అది సక్రమ సంపాదన అని నిరూపించే ఆధారాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు చూపించాలి. ITR డిక్లరేషన్ తదితర డాక్యుమెంట్లలోని లెక్కలతో మీ దగ్గర ఉన్న నగదు మ్యాచ్ అవ్వాలి. లేదంటే చిక్కుల్లో పడ్డట్లే.
మరిన్ని వీడియోల కోసం
దర్జాగా పెళ్లి కొచ్చి.. భోజనం చేసి వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంటే వీడియో?
పీఎం మోదీ ఏసీ స్కీమ్ అంతా ఫేక్.. వీడియో వైరల్
10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
