ఆ స్టార్ హీరోయిన్‌కు పెళ్లైందని రోజంతా ఏడ్చేసిన అల్లు అర్జున్!
29 April 2025
Basha Shek
పుష్ప, పుష్ప 2 సినిమాలతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు అతనికి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు.
మరీ ముఖ్యంగా పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ తో సినిమాలు చేసేందుకు స్టార్ డైరెక్టర్లు పోటీ పడుతున్నారు.
అలాగే బన్నీతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇంతటి ఫాలోయింగ్ ఉన్న బన్నీ ఒక స్టార్ హీరోయిన్ పై మనసు పారేసుకున్నాడట. ప్రేమ కూడా పెంచుకున్నాడట.
అయితే చివరకు ఆ స్టార్ హీరోయిన్ వేరొకరిని పెళ్లి చేసుకోవడంతో అల్లు అర్జున్ హార్ట్ బ్రేక్ అయ్యిందట.
అల్లు అర్జున్ మనసు దోచుకున్న ఆ స్టార్ హీరోయిన్ మరోవరె కాదు అలనాటి అందాల తార దివంగత నటి శ్రీదేవి.
చాలామంది హీరోల్లాగే బన్నీకి కూడా శ్రీదేవిపై క్రష్ ఉండేదట. ఆమెపై విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడట.
ఇక శ్రీదేవి బోనీ కపూర్ ని పెళ్లి చేసుకున్నప్పుడు బన్నీ హార్ట్ బ్రేక్ అయ్యిందట. రోజంతా ఏడుస్తూ కూర్చున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు బన్నీ.
ఇక్కడ క్లిక్ చేయండి..