AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఉరుములతో ఏపీ‌లో వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాలకు

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో, రాయలసీమలో రాగల 3 రోజుల్లో వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణంతో పాటు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో రానున్న 5 రోజుల్లో గణనీయమైన మార్పు లేదు. తర్వాత స్వల్పంగా పెరిగే అవకాశముంది. వాతావరణ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం..

AP Rains: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఉరుములతో ఏపీ‌లో వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాలకు
Ravi Kiran
|

Updated on: Apr 29, 2025 | 6:26 PM

Share

వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల నుండి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, మరాఠ్వాడ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర-దక్షిణ ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. పశ్చిమ గాలుల ద్రోణి 15° ఉత్తర అక్షాంశం 84° తూర్పు రేఖాంశం మద్య వెంబడిస్తూ ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 5.8 & 9.6 కి.మీ మధ్య ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ, నైరుతి గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు : ———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు, రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ——————————–

ఈరోజు:- వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది .

రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి .మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:- ——————-

ఈరోజు:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40 -50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.