Tollywood: కుటుంబం కోసం కార్పెంటర్ పని.. కట్ చేస్తే.. పాన్ ఇండియా సూపర్ స్టార్..
కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు పని కోసం చాలా కష్టపడ్డాడు. చిన్న వయసులోనే ఫ్యామిలీ సమస్యలను భుజాన వేసుకున్నాడు. రోజూ కూలీగా మారాడు. అలాగే కార్పెంటర్ పని సైతం చేశాడు. కానీ నటనపై ఆసక్తితో ఎన్నో కష్టాలు ఎదుర్కొని సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా ఓ రేంజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలోని యంగ్ హీరోలకు అతడే స్పూర్తి.

సౌత్ ఇండస్ట్రీ నుంచి నార్త్ వరకు నటనలో తనదైన ముద్ర వేశాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. సహజ నటనతోనే కాకుండా డిఫరెంట్ స్టైల్, యాటిట్యూడ్, మేనరిజంతో యూత్‌లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దక్షిణాదిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐదు దశాబ్దాలుగా సినీరంగంలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికీ అతడి స్టైల్, యాక్టింగ్, ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని దినసరి కూలీగా మారాడు. కార్పెంటర్, కండక్టర్ ఇలా ఎన్నో పనులు చేసి ఫ్యామిలీకి అండగా నిలబడ్డాడు. కానీ ఇప్పుడు అతడు పాన్ ఇండియా స్టార్ హీరో. అతడు మరెవరో కాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్. సినిమాల్లోకి రాకముందు రజినీకాంత్ బస్ కండక్టర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే.
1950 డిసెంబర్ 12న బెంగుళూరులోని మరాఠీ కుటుంబంలో జన్మించాడు రజినీ. అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. చిన్న వయసులోనే తల్లిని కోల్పోయిన ఆ తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇంటిని నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్‌లో కండక్టర్‌గా కూడా పనిచేశాడు. నటనపై ఆసక్తితో కండక్టర్‌గా పనిచేస్తూనే కొన్ని స్టేజ్ షోస్ ఇచ్చాడు. అదే సమయంలో ఒక వార్త పత్రికలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి సినిమాల్లో నటించేందుకు కోర్సులు అందిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. తన స్నేహితుడి సహాయంతో నటనా సంస్థలో చేరాడు. మొదట్లో కన్నడలో పలు నాటకాల్లో పాల్గొన్నాడు. మహాభారతంలోని దుర్యోధనుడిగా రజినీ నటనకు ప్రశంసలు అందుకున్నాడు. రజనీకాంత్ తమిళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించే ముందు తమిళ భాష నేర్చుకున్నాడు. ఆయన మొదటి చిత్రం అపూర్వ రాగంగల్. ఇందులో కమల్ హాసన్ సైతం నటించారు.
తమిళంతోపాటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించాడు. అలాగే అందా కానూన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత హిందీలో భగవాన్ దాదా, ఆటాంక్ హి ఆటాంక్, చాల్ బాజ్ వంటి చిత్రాల్లో నటించాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో వెండితెరపై తనదైన ముద్రవేశారు రజినీ. సినిమాలతోపాటు ఇటు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. కానీ అప్పటికే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రజినీ తన ఆలోచనను మార్చుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..
