Bharat Biotech: తిరుమల శ్రీవారికి రూ.2 కోట్ల విరాళం అందజేసిన భారత్‌ బయోటెక్‌ అధినేత..!

Bharat Biotech: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించుకున్నారు. భారత్‌ బయోటెక్‌ సంస్థ..

Bharat Biotech: తిరుమల శ్రీవారికి రూ.2 కోట్ల విరాళం అందజేసిన భారత్‌ బయోటెక్‌ అధినేత..!
Tirumala
Follow us

|

Updated on: Jan 13, 2022 | 6:41 AM

Bharat Biotech: కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించుకున్నారు. భారత్‌ బయోటెక్‌ సంస్థ అధినేత కృష్ణా ఎల్లా, సుచిత్ర ఎల్లా తిరుమల శ్రీవారికి రూ.2 కోట్లు విరాళం అందజేశారు. అన్న ప్రసాదం ట్రస్టుకు ఈ విరాళ అందించారు. ఈ విరాళ చెక్కును ఆలయంలో టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి అందజేశారు. శ్రీవారికి విరాళం అందజేసిన కృష్ణా ఎల్లా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే ఇటీవల డిసెంబర్‌ నెలలో కృష్ణా ఎల్లా, సుచిత్ర ఎల్లా శబరిమల అయ్యప్పస్వాముల కోసం శబరిమలలో అన్నదానం కోసం కోటి రూపాయల విరాళం అందించిన విషయం తెలిసిందే. తాజాగా తిరుమల అన్నదానం కోసం శ్రీవారికి రెండు కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు.

కాగా, తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకల సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఏకాదశి నాడు స్వామివారిని భారీ ఎత్తున భక్తులు తరలి రానున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. వైకుంఠ ఏకాద‌శి వేడుకల్లో భాగంగా తిరుమ‌ల శ్రీవారి ఆల‌యాన్ని అంగ‌రంగ వైభ‌వంగా తీర్చిదిద్దారు టీటీడీ అధికారులు. తీరొక్క పూలు, విద్యుత్ కాంతుల వెలుగులో వెంకన్న ఆల‌యం వెలిగిపోతోంది. ఇక వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం చేసుకోవ‌డానికి ఇప్ప‌టికే భ‌క్తులు భారీగా తిరుమ‌ల చేరుకున్నారు. తొలిసారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాన్ని టీటీడీ భ‌క్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 13వ తేదీ నుంచి 22 వ‌ర‌కు భ‌క్తులు శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా ద‌ర్శించుకోనున్నారు.

ఇవి కూడా చదవండి:

Vaikunta ekadasi Tirumala: అంగ‌రంగ వైభ‌వంగా తిరుమ‌ల ఆల‌యం.. వైకుంఠ ఏకాద‌శికి స‌ర్వం సిద్ధం..

Tirumala: అర్ధరాత్రి నుంచే 10 రోజుల పాటు శీవారి వైకుంఠ ద్వార దర్శనం.. ఈనెల 22 వరకూ సిఫార్స్ లేఖలు రద్దు..

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?