Tirumala: అర్ధరాత్రి నుంచే 10 రోజుల పాటు శీవారి వైకుంఠ ద్వార దర్శనం.. ఈనెల 22 వరకూ సిఫార్స్ లేఖలు రద్దు..

Tirumala: హిందువులు వైకుంఠ ఏకాదశిని పవిత్రం భావిస్తారు ఈరోజున వైష్ణవ ఆలయాలకు భక్తులు పోతెట్టుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైన తిరుమలలో (Tirumala) భక్తులు బారులు..

Tirumala: అర్ధరాత్రి నుంచే 10 రోజుల పాటు శీవారి వైకుంఠ ద్వార దర్శనం.. ఈనెల 22 వరకూ సిఫార్స్ లేఖలు రద్దు..
Tirumala Tirupati
Follow us
Surya Kala

|

Updated on: Jan 12, 2022 | 11:43 AM

Tirumala: హిందువులు వైకుంఠ ఏకాదశిని పవిత్రం భావిస్తారు ఈరోజున వైష్ణవ ఆలయాలకు భక్తులు పోతెట్టుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైన తిరుమలలో (Tirumala) భక్తులు బారులు తీరుతారు. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తిరుమల తిరుపతికి చేరుకుంటారు. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానునుంది. ఈ నెల 13వ తేది నుంచి 22వ తేది వరకు భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనం చేసుకునే వీలుని టిటిడీ (TTD) అధికారులు కల్పించారు.

శ్రీవారి ఆలయంలో 1863లో వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించిన అప్పటి మహంతు సేవాదాస్ ప్రారంభించారు. వైకుంఠ ద్వాదశికి వైకుంఠ ద్వార దర్శనం 1949లో నుంచి టిటిడీ ప్రారంభించింది. అప్పటి నుంచి రోజు రోజుకీ ముక్కోటి ఏకాదశికి శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగిపొతూ వచ్చింది. అంతమంది భక్తులకు ఒకే రోజు వైకుంఠ ద్వార దర్శనాన్ని ఇవ్వలేని టిటిడీ కీలక నిర్ణయం తీసుకుంది.

2020 నుంచి శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని టిటిడి ప్రారంభించింది. ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే భక్తులకు టిటిడీ టోకెన్లను జారీ చేసింది. రోజుకు 20 వేల మందికి 300 రూపాయల టికెట్లు, 5వేల మందికి ఆఫ్ లైన్ లో, 5 వేల మందికి ఆన్ లైన్ లో ఉచిత దర్శనం టోకెన్లు టీటీడీ జారీ చేసింది. మరోవైపు శ్రీవాణి ట్రస్ట్, విఐపిలకు అదనంగా దాదాపు మరో10 వేల టిక్కెట్లను జారీ చేయనున్నది. భక్తుల రద్దీ తగిన విధంగా కరోనా నిబంధనలు పాటిస్తూ.. టిటిడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని.. టిటిడీ కోరుతుంది. మరోవైపు ఈ నెల 22 వరకు సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

దేవతలకు ఒక్క రోజు మానవులుకు 365 రోజులుగా పెద్దల నమ్మకం.మహావిష్ణువు ముక్కోటి దేవతలకు 40 నిమిషాలు దర్శన భాగ్యం కల్పిస్తే.. వైకుంఠ ఏకాదశి నుంచి వచ్చే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ.

Also Read:  అర్ధరాత్రి సజ్జనార్ కు యువతి ట్వీట్.. వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న ఆర్టీసీ ఎండీ

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?