Narender Vaitla |
Updated on: Jan 12, 2022 | 10:31 PM
వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు టీటీడీ అధికారులు.
తీరొక్క పూలు, విద్యుత్ కాంతుల వెలుగులో వెంకన్న ఆలయం వెలిగిపోతోంది. ఇక వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి ఇప్పటికే భక్తులు భారీగా తిరుమల చేరుకున్నారు.
తొలిసారి వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 13వ తేదీ నుంచి 22 వరకు భక్తులు శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకోనున్నారు.
వైకుంఠ ద్వార దర్శనంలో భాగంగా టీటీడీ ఇప్పటికే భక్తులకు రోజుకు 20 వేల మందికి 300 రూపాయల టికెట్లు, 5వేల మందికి ఆఫ్ లైన్ లో, 5 వేల మందికి ఆన్ లైన్ లో ఉచిత దర్శనం టోకెన్లు టీటీడీ జారీ చేసింది. .
మరోవైపు శ్రీవాణి ట్రస్ట్, విఐపిలకు అదనంగా దాదాపు మరో10 వేల టిక్కెట్లను జారీ చేయనున్నది. భక్తుల రద్దీ తగిన విధంగా కరోనా నిబంధనలు పాటిస్తూ.. టిటిడీ అధికారులు ఏర్పాట్లు చేశారు.