IND vs SA, 3rd Test, Day 3, Highlights: ముగిసిన మూడో రోజు ఆట.. విజయానికి దక్షిణాఫ్రికాకు 111 పరుగులు, భారత్‌కు 8 వికెట్లు

Venkata Chari

|

Updated on: Jan 13, 2022 | 9:52 PM

IND vs SA, 3rd Test: మూడో రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా టీం 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు సాధించింది. దీంతో ‎ఆ జట్టు విజయానికి మరో 111 పరుగులు అవసరం కానున్నాయి. భారత్ విజయం సాధించాలంటే మాత్రం 8 వికెట్లు పడగొట్టాల్సి ఉంది.

IND vs SA, 3rd Test, Day 3, Highlights: ముగిసిన మూడో రోజు ఆట.. విజయానికి దక్షిణాఫ్రికాకు 111 పరుగులు, భారత్‌కు 8 వికెట్లు
India Vs Sa; Rishabh Pant Half Century

IND vs SA, 3rd Test, Day 3, Highlights: మూడో రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా టీం 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు సాధించింది. దీంతో ‎ఆ జట్టు విజయానికి మరో 111 పరుగులు అవసరం కానున్నాయి. భారత్ విజయం సాధించాలంటే మాత్రం 8 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. బుమ్రా, షమీ తలో వికెట్ పడగొట్టాడరు. అయితే భారత బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు ధాటిగా ఆడుతూ విజాయానికి చేరవవుతున్నారు. అంతకు ముందు టీమిండియా 198 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో మొత్తం 212 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందు ఉంచింది. పంత్ తన సూపర్ సెంచరీతో భారత్ ఆ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది.భారత్, దక్షిణాఫ్రికా (India Vs South Africa) జట్ల మధ్య కేప్ టౌన్‌ (Cape Town Test)లో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్‌లో నేడు మూడో రోజు. రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 2 వికెట్లు నష్టపోయి 57 పరుగులు చేసింది. క్రీజులో పుజారా 9, విరాట్ 14 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మొత్తంగా టీమిండియా 70 పరుగుల లీడ్‌లో ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకు ఆలౌట్‌ అయింది. దక్షిణాఫ్రికా టీం తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులకు ఆలౌట్ అయింది.

టీమిండియా ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే, రిషబ్ పంత్(కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్‌సన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, టెంబా బావుమా, కైల్ వెర్రెయిన్నే (కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువాన్ ఒలివియర్, లుంగి ఎంగిడి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 13 Jan 2022 09:31 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా

    ఎట్టకేలకు భారత బౌలర్లకు రెండో వికెట్ దక్కింది. సౌతాఫ్రికా సారథి డీన్ ఎల్డర్‌(30)ను బుమ్రా బోల్తా కొట్టించి, భారత శిబిరంలో కొద్దిగా ఆశలు రేపాడు.

  • 13 Jan 2022 09:21 PM (IST)

    100 పరుగులకు చేరిన దక్షిణాప్రికా

    చివరి వన్డేలో భారత్‌కు ఓటమి తప్పేలా లేదు. భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నారు. టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా బ్యాటర్లు విజయానికి చేరువవుతున్నారు. ప్రస్తుతం 28 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 95 పరుగులు చేసింది. మరో 117 పరుగుల వెనుకంజలో నిలిచారు. క్రీజులో పీలర్సన్ 42, డీన్ ఎల్గర్ 30 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 13 Jan 2022 07:55 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా

    212 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఐడెన్ మార్క్రామ్ 16 పరుగులు చేసిన అనంతరం షమీ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో సౌతాఫ్రికా 23 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.

  • 13 Jan 2022 07:26 PM (IST)

    సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ మొదలు..

    సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ మొదలైంది. 212 పరుగుల టార్గెట్‌తో దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది. ఓపెనర్లుగా ఐడెన్ మార్క్రామ్ , డీన్ ఎల్గర్ బ్యాటింగ్‌ మొదలుపెట్టారు. అంతకుముందు భారత్ 198 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా ముందు 212 పరుగుల టార్గెట్ ఉంచింది. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ 100* నాటౌట్‌గా నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. ఈ టెస్టులో గెలవాలంటే భారం అంతా బౌలర్లపైనే నిలిచింది.

  • 13 Jan 2022 06:55 PM (IST)

    సౌతాఫ్రికా టార్గెట్ 212..

    టీమిండియా రెండో ఇన్నింగ్స్ ముగిసింది. 198 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా ముందు 212 పరుగుల టార్గెట్ ఉంది. భారత ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ 100* నాటౌట్‌గా నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ పెద్దగా రాణించలేకపోవడంతో 198 పరుగులకే భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. ఈ టెస్టులో గెలవాలంటే భారం అంతా బౌలర్లపైనే నిలిచింది.

  • 13 Jan 2022 06:47 PM (IST)

    ఆసియా వెలుపల భారత వికెట్ కీపర్ల టెస్ట్ సెంచరీలు..

    118 మంజ్రేకర్ vs వెస్టిండీస్, ​​కింగ్‌స్టన్ 1952/53

    115* రాత్ర vs వెస్టిండీస్, ​​సెయింట్ జాన్స్ 2002

    104 సాహా vs వెస్టిండీస్, ​​గ్రాస్ ఐలెట్ 2016

    114 రిషబ్ పంత్ vs ఇంగ్లండ్, ది ఓవల్ 2018

    159* రిషబ్ పంత్ vs ఆస్ట్రేలియా 2018/19

    100* రిషబ్ పంత్ vs సౌతాఫ్రికా, కేప్ టౌన్ 2021/22

  • 13 Jan 2022 06:42 PM (IST)

    పంత్ సూపర్ సెంచరీ..

    రెండో ఇన్నింగ్స్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడుతోన్న రిషబ్ పంత్ దక్షిణాఫ్రికాలో తన తొలి సెంచరీని పూర్తిచేసుకున్నాడు. 133 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో వంద పరుగులు పూర్తి చేశాడు. దీంతో టీమిండియా ప్రస్తుతం 208 ఆధిక్యంలోకి దూసుకెల్లింది.

  • 13 Jan 2022 06:35 PM (IST)

    తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్..

    షమీ(0) రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 189 పరుగుల వద్ద ఉంది. దీంతో ఆధిక్యం 202 పరుగులకు చేరుకుంది. రిషబ్ పంత్ 94 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

  • 13 Jan 2022 06:27 PM (IST)

    దక్షిణాఫ్రికాపై ఆసియా వికెట్ కీపర్ అత్యధిక స్కోర్లు..

    91* రిషబ్ పంత్, కేప్ టౌన్ 2021/22 90 ఎంఎస్ ధోని. సెంచూరియన్ 2010/11 89 కే సంగక్కర సెంచూరియన్ 2002/03 70 లిటన్ దాస్ బ్లూమ్‌ఫోంటీన్ 2017/18

  • 13 Jan 2022 06:25 PM (IST)

    200లకు చేరిన ఆధిక్యం..

    రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ప్రస్తుతం 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులకు చేరింది. దీంతో ఆధిక్యం 200 పరుగులకు చేరుకుంది. ఓవైపు వికెట్లు పడుతున్నా.. తన అద్భుత ఆటతో రిషబ్ పంత్ (92) ఆకట్టుకుంటూ ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాపై తొలి అర్థసెంచరీ పూర్తి చేసిన పంత్.. సెంచరీకి మరో 8 పరుగుల దూరంలో నిలిచాడు.

  • 13 Jan 2022 06:05 PM (IST)

    ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్..

    ఉమేష్ యాదవ్(0) రూపంలో 8వ వికెట్‌‌ను భారత్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 180 పరుగులు చేసింది. దీంతో ఆధిక్యం 193 పరుగులకు చేరుకుంది. పంత్ 87 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

  • 13 Jan 2022 05:53 PM (IST)

    ఏడో వికెట్ కోల్పోయిన భారత్..

    శార్ధుల్ ఠాకూర్(5) రూపంలో 7వ వికెట్‌‌ను భారత్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 170 పరుగులు చేసింది. దీంతో ఆధిక్యం 183 పరుగులకు చేరుకుంది. పంత్ 77 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

  • 13 Jan 2022 05:33 PM (IST)

    ఆరో వికెట్ కోల్పోయిన భారత్..

    రవి చంద్రన్ అశ్విన్(7) రూపంలో 6వ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 162 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా ఆధిక్యం 176 పరుగులకు చేరింది.

  • 13 Jan 2022 05:12 PM (IST)

    ఐదో వికెట్ కోల్పోయిన భారత్..

    విరాట్ కోహ్లీ(29) రూపంలో టీమిండియా ఐదో వికెట్‌ను కోల్పోయింది. కీలక భాగస్వామ్యం ఆడిన పంత్(71), విరాట్ కోహ్లీ (29) 179 బంతుల్లో 94 పరుగులు పూర్తి చేశారు. ఈ క్రమంలో భారీ ఇన్నింగ్స్‌ ఆడేలా కనిపించిన వీరిద్దరిని ఎంగిడి విడదీశాడు. దీంతో 152 పరుగుల వద్ద భారత్ 5వ వికెట్‌ను కోల్పోయింది.

  • 13 Jan 2022 04:22 PM (IST)

    లంచ్ బ్రేక్..

    విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కలిసి భారత్ స్కోర్‌ను 130 పరుగులకు చేర్చారు. అలాగే 72 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 43 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయిన భారత్ 130 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆధిక్యం 143 పరుగులకు చేరింది. విరాట్ కోహ్లీ 28, పంత్ 51 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 13 Jan 2022 04:22 PM (IST)

    పంత్ అర్థసెంచరీ..

    రిషబ్ పంత్ తన అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాపై తన తొలి అర్థసెంచరీ పూర్తి చేశాడు.58 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో తన హాఫ్ సెంచరీ పూర్త చేశాడు.

  • 13 Jan 2022 03:42 PM (IST)

    అర్థ సెంచరీ దాటిన భాగస్వామ్యం..

    మూడో రోజు ఆట ప్రారంభంలోనే వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ పీకల్లోతూ కష్టాల్లో పడిన భారత్‌ను కెప్టెన్ కోహ్లీ, పంత్‌లు ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి భారత్ స్కోర్‌ను 100 పరుగులు దాటించడంతోపాటు 50 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. 37.3 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయిన భారత్ 111 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆధిక్యం 124 పరుగులకు చేరింది. విరాట్ కోహ్లీ 23, పంత్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.

  • 13 Jan 2022 03:33 PM (IST)

    100 పరుగులు దాటిన టీమిండియా స్కోర్..

    మూడో రోజు ఆట ప్రారంభంలోనే వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ పీకల్లోతూ కష్టాల్లో పడిన భారత్‌ను కెప్టెన్ కోహ్లీ, పంత్‌లు ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి భారత్ స్కోర్‌ను 100 పరుగులు దాటించారు. 36 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయిన భారత్ 104 పరుగులు చేసింది. దీంతో భారత్ ఆధిక్యం 117 పరుగులకు చేరింది. క్రీజులో విరాట్ కోహ్లీ(19), పంత్ (36) ఉన్నారు.

  • 13 Jan 2022 03:12 PM (IST)

    100 పరుగులు దాటిన ఆధిక్యం..

    మూడో రోజు ఆట ప్రారంభంలోనే వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌కు పీకల్లోతూ కష్టాల్లో పడింది. దీంతో భారతమంతా కెప్టెన్ కోహ్లీ, పంత్‌లపైనే పడింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 100 పరుగులు దాటింది. క్రీజులో విరాట్ కోహ్లీ(17), పంత్ (25) ఉన్నారు.

  • 13 Jan 2022 02:20 PM (IST)

    అజింక్య రహానె చివరి 50 టెస్టులు

    85 ఇన్నింగ్స్‌లు, 2659 పరుగులు, 33.23 సగటు, 4 సెంచరీలు, 16 అర్థ సెంచరీలు

  • 13 Jan 2022 02:15 PM (IST)

    వరుసగా రెండో దెబ్బ..

    మూడో రోజు ఆట మొదలైందో లేదో.. భారత్ వరుసగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతూ కష్టాల్లో పడుతోంది. పుజారా(9), రహానె(1) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. దీంతో భారమంతా సారథి కోహ్లీ పైనే పడింది. 58 పరుగుల వద్ద భారత్ 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 73 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

  • 13 Jan 2022 02:08 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన భారత్

    మూడో రోజు ఆట ప్రారంభంలోనే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పుజారా 9 పరుగులు చేసి మాక్రో జాన్‌సెన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 57 పరుగుల వద్ద 3 వ వికెట్‌ను కోల్పోయింది.

Published On - Jan 13,2022 2:06 PM

Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే