NRI News: సరిహద్దుల్లో ఏడు దశాబ్దాల తరువాత కలిసిన సోదరులు.. పాకిస్తాన్ సైనికులు ఏం చేశారంటే..

ఏడు దశాబ్దాల క్రితం విడిపోయిన బంధం.. మళ్ళీ కనిపిస్తే.. ఆ భావోద్వేగాన్ని లెక్క పెట్టడానికి కొలమానం లేదు. సరిగ్గా అదే జరిగింది ఈ ఇద్దరు సోదరులకు. భారతదేశం-పాకిస్తాన్(India-Pakistan) విభజన సమయంలో, 74 సంవత్సరాల క్రితం విడిపోయిన ఇద్దరు నిజమైన సోదరులు కలుసుకున్నారు.

NRI News: సరిహద్దుల్లో ఏడు దశాబ్దాల తరువాత కలిసిన సోదరులు.. పాకిస్తాన్ సైనికులు ఏం చేశారంటే..
Indo Pakistan Brothers
Follow us

|

Updated on: Jan 14, 2022 | 12:30 PM

ఏడు దశాబ్దాల క్రితం విడిపోయిన బంధం.. మళ్ళీ కనిపిస్తే.. ఆ భావోద్వేగాన్ని లెక్క పెట్టడానికి కొలమానం లేదు. సరిగ్గా అదే జరిగింది ఈ ఇద్దరు సోదరులకు. భారతదేశం-పాకిస్తాన్(India-Pakistan) విభజన సమయంలో, 74 సంవత్సరాల క్రితం విడిపోయిన ఇద్దరు నిజమైన సోదరులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ బోరున విలపించడంతో అక్కడున్న మిగతా వారి కళ్లు కూడా తడిమారాయి. పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌(Faisalabad)లో నివసిస్తున్న మహ్మద్ సాదిక్ .. భారతదేశం(India)లో నివసిస్తున్న మహ్మద్ హబీబ్ అకా అలియాస్ శైలా పాకిస్తాన్‌లోని శ్రీ కర్తార్‌పూర్ సాహిబ్‌లో కలుసుకున్నారు.

అన్నదమ్ములిద్దరి కలయికకు సోషల్ మీడియా మాధ్యమంగా మారింది. ఇద్దరూ మొదట ఈ వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లో కలుసుకున్నారు, తర్వాత ముఖాముఖిగా కలుసుకున్నారు. మొదట ఇద్దరూ కౌగిలించుకుని ఏడ్చారు, తర్వాత ఒకరి కన్నీళ్లు ఒకరు తుడుచుకున్నారు. హబీబ్ తన పాకిస్థానీ సోదరుడు సాదిక్‌తో ప్రేమగా మాట్లాడాడు. హబీబ్ తన జీవితమంతా తన తల్లి సేవకే అంకితం చేశానని సోదరుడికి చెప్పాడు. తల్లిని చూసుకోవడం కోసం అతను పెళ్లి కూడా చేసుకోలేదు.

పాక్ రేంజర్లు కూడా ఇద్దరినీ విడదీసే సాహసం చేయలేదు

కారిడార్‌లోకి అడుగు పెట్టగానే, భారతీయుడు ఏ పాకిస్తానీతో మాట్లాడకూడదని లేదా నంబర్‌ను మార్చుకోవద్దని పాకిస్తాన్ అధికారుల మొదటి సూచన. కారిడార్‌లో ఒక భారతీయుడు పాకిస్తానీతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తే, పాక్ రేంజర్లు అడ్డుకున్నారు. కానీ, ఈ సన్నివేశం తర్వాత.. పాక్ రేంజర్ల గుండె కూడా పగిలిపోయింది. సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇద్దరు సోదరులను విడదీయడానికి ఎవరూ సాహసించలేదు.

హృదయ విదారక సన్నివేశం..

కర్తార్‌పూర్ కారిడార్ ప్రాజెక్ట్ సీఈఓ మహ్మద్ లతీఫ్ మాట్లాడుతూ, ఇద్దరు సోదరులు ఒకరినొకరు కౌగిలించుకున్నప్పుడు, వారిద్దరూ భావోద్వేగంతో పెద్దగా రోదించారని చెప్పారు. ఈ దృశ్యం అక్కడి అందరి హృదయాలను కదిలించిందని అన్నారు. శ్రీ కర్తార్‌పూర్ సాహిబ్‌కు ఒక రోజులో దాదాపు 5000 మంది భారతీయులను తీసుకురావాలనే నిబంధన ఉంది. అయితే, ప్రస్తుతం ఈ సంఖ్య 200 కంటే తక్కువగా ఉంది.

ఈ సోదరుల కలయిక సందర్భంగా సరిహద్దుల్లో ఏం జరిగిందో ఈ ట్వీట్ లో చూడండి..

 

ఇంతకు ముందు కూడా..

విభజనలో విడిపోయిన ప్రజలు కర్తార్‌పూర్‌లో కలవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు అజ్జోవల్ హోషియార్‌పూర్‌కు చెందిన సునీతాదేవి తన కుటుంబంతో కలిసి కర్తార్‌పూర్ వెళ్లి తన బంధువులను కలిశారు. దేశవిభజన సమయంలో సునీత తండ్రి భారత్‌లోనే ఉండడంతో కుటుంబ సభ్యులు పాకిస్థాన్‌కు వెళ్లిపోయారు. అదేవిధంగా అమృత్‌సర్‌కు చెందిన జతీందర్ సింగ్ .. హర్యానాకు చెందిన మంజిత్ కౌర్ తమ ఆన్‌లైన్ స్నేహితులను కలవడానికి శ్రీ కర్తార్‌పూర్ సాహిబ్ చేరుకున్నారు. అయితే వారిద్దరినీ పాకిస్థాన్ రేంజర్లు వెనక్కి పంపించారు.

ఇవి కూడా చదవండి: Corona: కరోనా టెర్రర్‌.. ఢిల్లీ, ముంబైలలో త్వరలో పీక్ స్టేజ్..! 8 రోజులుగా దేశంలో రోజుకు లక్షకు పైగా కొత్త కేసులు..

Letter war: టీఆర్ఎస్-బీజేపీ లెటర్ వార్.. మొన్న మోడీకి సీఎం కేసీఆర్ లేఖ.. కౌంటర్‌గా కేసీఆర్‌కు బండి సంజయ్ లెటర్!