Letter war: టీఆర్ఎస్-బీజేపీ లెటర్ వార్.. మొన్న మోడీకి సీఎం కేసీఆర్ లేఖ.. కౌంటర్‌గా కేసీఆర్‌కు బండి సంజయ్ లెటర్!

తెలంగాణలో ఇప్పుడప్పుడే ఎన్నికలు లేనప్పటికీ పొలిటికల్ వార్ ఊపందుకుంది. బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మధ్య ఇప్పుడు లెటర్‌ వార్‌ నడుస్తోంది. సై అంటే సై. ఢీ అంటే ఢీ. ఎవ్వరూ తగ్గడం లేదు.

Letter war: టీఆర్ఎస్-బీజేపీ లెటర్ వార్.. మొన్న మోడీకి సీఎం కేసీఆర్ లేఖ.. కౌంటర్‌గా కేసీఆర్‌కు బండి సంజయ్ లెటర్!
Bandi Sanjay Wrote An Open

Bandi Sanjay writes letter to CM KCR: తెలంగాణలో ఇప్పుడప్పుడే ఎన్నికలు లేనప్పటికీ పొలిటికల్ వార్ ఊపందుకుంది. గత కొంతకాలంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో రెండు పార్టీల మధ్య ఇప్పుడు లెటర్‌ వార్‌ నడుస్తోంది. సై అంటే సై. ఢీ అంటే ఢీ. ఎవ్వరూ తగ్గడం లేదు.

దేశంలో ఎరువుల ధరలు విపరీతంగా పెంచడం, రైతు వ్యతిరేక విధానలను ప్రశ్నిస్తూ మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖాస్త్రం సంధించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దీనికి కౌంటర్‌గా సీఎం కేసీఆర్‌కు లెటర్‌ రాశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ప్రధాని మోడీకి కేసీఆర్ రాసిన లేఖ పచ్చి అబద్దాలతో ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందని ఆరోపించారు సంజయ్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, బీజేపీ చేస్తున్న పోరాటల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే, లేఖపేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వచ్చే ఉగాది నాటికి అమలు చేయకపోతే రైతుల పక్షాన మరో మహోద్యమానికి శ్రీకారం చుడతామని తెలంగాణ బీజేపీ చీఫ్ హెచ్చరించారు.

అటు బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్‌ వార్ కంటిన్యూ అవుతోంది. కేసీఆర్‌ను వదిలిపెట్టేది లేదంటున్నారు కమలనాథులు. మరోవైపు, కేసీఆర్‌ను టచ్‌చేస్తే దేశం అగ్నిగుండమే అంటున్నారు గులాబీ నేతలు.

Read Also…  Credit Card Fraud: ఫోన్ కాల్ వారి పెట్టుబడి.. రూ.50 కోట్లు స్వాహా.. క్లోనింగ్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

Published On - 7:39 am, Fri, 14 January 22

Click on your DTH Provider to Add TV9 Telugu