AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: ఉక్రెయిన్ ఆర్మీకి ఉపిరిపోస్తున్న రష్యాన్‌ కుక్క..! పుతిన్‌ సైన్యానికి చుక్కలే..

కుక్కను విశ్వాసానికి ప్రతీకగా చెబుతారు..ఇక్కడ మరోమారు అది రుజువైంది. అనారోగ్యంతో ఉన్న ఓ సైనిక శునకాన్ని రష్యా సేనలు నిర్ధాక్షిణ్యంగా వదిలి పెడితే, ఈ కుక్కని చూసిన ఉక్రెయిన్ ఆర్మీ జాలి పడింది.

Russia Ukraine War: ఉక్రెయిన్ ఆర్మీకి ఉపిరిపోస్తున్న రష్యాన్‌ కుక్క..! పుతిన్‌ సైన్యానికి చుక్కలే..
Russian Dog
Jyothi Gadda
|

Updated on: May 26, 2022 | 9:52 PM

Share

కుక్కను విశ్వాసానికి ప్రతీకగా చెబుతారు..ఇక్కడ మరోమారు అది రుజువైంది. అనారోగ్యంతో ఉన్న ఓ సైనిక శునకాన్ని రష్యా సేనలు నిర్ధాక్షిణ్యంగా వదిలి పెడితే, ఈ కుక్కని చూసిన ఉక్రెయిన్ ఆర్మీ జాలి పడింది. దాన్ని చేరదీసి సపర్యాలు చేసింది ఉక్రెయిన్‌ సైన్యం..దానికి మందులు ఇచ్చి..మంచి ఆహారం అందించాయి…ఇక ఆ తరువాత పూర్తిగా కోలుకున్న ఆ డాగ్‌ స్క్వాడ్‌..రష్యా సైన్యానికి చుక్కలు చూపెడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ కుక్క పేరు మాక్స్, దీని వయసు వయస్సు 3 సంవత్సరాలు. రష్యా సైన్యం దీన్ని దిక్కులేకుండా వదిలేస్తే…ఆకలితో బాధపడుతూ ఉక్రేనియన్ సైనికులకు దొరికింది.. ఉక్రెయిన్‌ సైనికులు దాన్ని చేరదీశారు. ఆసుపత్రికి తీసుకెళ్లారు, చికిత్స అందించారు. పూర్తి కోలుకునేందుకు అన్ని విధాలా సేవలందించారు. ఇక దాంతో మాక్స్‌ ఉక్రేనియన్ సైన్యం చెప్పినట్టుగా చేస్తోంది. ఒకప్పుడు ఇది రష్యా సైనికులు చెప్పినట్లు చేసేది. కానీ.. ఉక్రెయిన్ సైనికులు ఈ కుక్కకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి.. దాని మైండ్ సెట్ ను మార్చేశారు. ఉక్రెయిన్ సైనికులు నుంచుమంటే నుంచుంటుంది. కూర్చోమంటే కూర్చుంటుంది. దానికి అలా ట్రైనింగ్ ఇచ్చి మార్చేశారు. ఇప్పుడు ఇది ఉక్రెయిన్ ఆర్మీలో చేరిపోయింది. బెల్జియన్ మలినోయిస్ జాతికి చెందిన ఈ కుక్క ఉక్రెయిన్ కోసం పోరాడుతోంది. రష్యన్ బలగాలు పెట్టిన మందు పాతరలను సులువుగా గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడంలో ఉక్రెయిన్ ఆర్మీకి సాయం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్ నేషనల్ గార్డ్ సభ్యుడు డిమిత్రి మాట్లాడుతూ…మాక్స్ ఉక్రెయిన్‌ను కాపాడతాడని చెప్పారు. మాక్స్ అంటే సైనికులకు ఇష్టమని అతని సహచరుడు చెప్పాడు. ఇంత అందమైన శునకాన్ని రష్యా సైనికులు ఎందుకు విడిచిపెట్టారో మాకు అర్థం కాలేదని అన్నారు. నల్ల సముద్రానికి దగ్గరగా ఉన్న మైకోలివ్ ప్రాంతంలోని ఒక గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మాక్స్ క్రెమ్లిన్ దళాలతో ఉంది. ఆ తర్వాత అది నిరాశ్రురాలిగా మారింది. ఆకలితో అలమటించి కుళ్ళిన ఆహారం తింటూ ఎలాగోలా బతికింది. చివరకు ఉక్రెయిన్‌ సైన్యానికి చిక్కి తమకు ఓ మంచి నేస్తంగా మారిందన్నారు. పుతిన్ ఆర్మీకి ముచ్చెమటలు పోయిస్తోందని చెప్పారు.

Follow Us