AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు నా సినిమాలో క్యారెక్టర్ చేశాడు.. ఇప్పుడు అతని సినిమాల్లో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్..

ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ను తన నటనతో కట్టిపడేసిన హీరో జగపతి బాబు. అప్పట్లో హీరోగా రాణించిన జగపతిబాబు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు . ముఖ్యంగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ లో ఎక్కువగా నటించారు జగపతి బాబు .

అప్పుడు నా సినిమాలో క్యారెక్టర్ చేశాడు.. ఇప్పుడు అతని సినిమాల్లో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్..
Jagapathi Babu
Rajeev Rayala
| Edited By: |

Updated on: Jun 01, 2026 | 10:03 AM

Share

విలక్షణ నటుడిగా తనకంటూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు నటుడు జగపతిబాబు. అప్పటిలో హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో జగపతిబాబుకు పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ ఉండేవారు. శుభలగ్నం, బడ్జెట్ పద్మనాభం, మావిచిగురు, పెళ్ళి పీటలు వంటి ఫ్యామిలి ఎంటర్టైనర్స్ తో పాటు.. అంతఃపురం , సముద్రం వంటి యాక్షన్ సినిమాలతో మాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నారు జగపతిబాబు. కాగా కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన జగపతి బాబు ఆతర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న జగపతి బాబు విలన్ గా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. బాలయ్యబాబు నటించిన లెజెండ్ సినిమాలో  జగ్గూభాయ్ విలన్ గా అదరగోట్టారు.

ఇది కూడా చదవండి : వామ్మో..! మెంటలెక్కిపోయే ట్విస్ట్‌లు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా… స్ట్రీమింగ్ ఎక్కడంటే

ఆతర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు జగపతి బాబు. విలన్ గా ఆయన అద్భుతమైన నటనతో మెప్పిస్తున్నారు. అరవింద సమేత సినిమాలో బసిరెడ్డిగా, రంగస్థలం సినిమాలో ఫణేంద్రభూపతిగా విలనిజం పండించి భయపెట్టారు జగపతి బాబు.. విలన్ గానే కాదు సహాయక పాత్రల్లోనూ తన నటనతో ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం పెద్ది సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు జగపతి బాబు. ఇదిలా ఉంటే జగపతి బాబు హీరోగా నటించిన సమయంలో ఆయన సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ఓ నటుడు.. ఇప్పుడు హీరోగా మారాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : బాలయ్య బిడ్డా మజాకా..! ఆ గ్రేస్ ముందు హీరోయిన్స్ తేలిపోతారుగా.. వీడియో వైరల్

అంతే కాదు ఆ హీరో సినిమాలో ఇప్పుడు జగపతి బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఆయన ఎవరో కాదు మాస్ మహారాజ రవితేజ. జగపతి బాబు నటించిన బడ్జెట్ పద్మనాభం సినిమాలో రవితేజ హీరో బావమరిది పాత్రలో నటించాడు. ఈ సినిమాలో రవితేజ తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు. అలాగే సముద్రం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రవితేజ కనిపించాడు. ఇక ఇప్పుడు రవితేజ స్టార్ హీరో అయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్ ప్లే చేశారు. ఇలా అప్పుడు తన సినిమాలో క్యారెక్టర్ వేసిన నటుడు.. ఇప్పుడు స్టార్ హీరోగా మారగా ఆయన సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో దీని గురించి ఆయన ప్రస్తావించారు కూడా..

ఇది కూడా చదవండి : ప్రివ్యూ చూసి ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అన్నారు..! కట్ చేస్తే ఇండస్ట్రీలోనే క్లాసిక్ హిట్

View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!