AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toilet on the stairs: రూ. 3కోట్ల ఖరీదైన ఇళ్లు..టాయిలెట్‌ ఎక్కడ కట్టారో చూస్తే అవాక్కే..! ఫోటో వైరల్

ప్రతి మనిషికి సొంతిళ్లు ఉండాలనేది చిరకాల కోరిక. ఆ ఇంటి కోసం చాలా మంది ఎన్నో ఏళ్లుగా కలలు కంటుంటారు. ఆ కల సాకారం చేసుకున్నప్పుడు వారు అనుభవించే సంతోషం మామూలుగా ఉండదు..అయితే,

Toilet on the stairs: రూ. 3కోట్ల ఖరీదైన ఇళ్లు..టాయిలెట్‌ ఎక్కడ కట్టారో చూస్తే అవాక్కే..! ఫోటో వైరల్
Toilet On The Stairs
Jyothi Gadda
|

Updated on: May 26, 2022 | 5:04 PM

Share

ప్రతి మనిషికి సొంతిళ్లు ఉండాలనేది చిరకాల కోరిక. ఆ ఇంటి కోసం చాలా మంది ఎన్నో ఏళ్లుగా కలలు కంటుంటారు. ఆ కల సాకారం చేసుకున్నప్పుడు వారు అనుభవించే సంతోషం మామూలుగా ఉండదు..అయితే, కొత్త ఇంటిని కొనుక్కోవాలనుకున్నా, లేదంటే, కట్టుకోవాలనుకున్నా మాత్రం అనేక విషయాలపై దృష్టి పెడతారు. ముఖ్యంగా వాస్తును చాలా మంది తప్పక పాటిస్తుంటారు. ఇంటి నిర్మాణం ఎలా ఉండాలి, బెడ్‌రూం, డైనింగ్‌ టేబుల్‌, వంటగది, బాత్‌రూం సరైన ప్రాంతంలో ఉండేలా చూసుకుంటారు. అన్ని సక్రమంగా, తమకు నచ్చిన విధంగా ఉంటేనే ఆ ఇంటిని నివాసయోగ్యంగా ఎంచుకుంటారు..కానీ, ఇక్కడ ఓ ఇంటికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ ఫోటోని చూసిన నెటిజన్లు ఇదేక్కడి విడ్డూరంరా బాబు అనుకుంటూ షాకింగ్‌ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఆ ఫోటో వెనకాల గల అసలు సంగతి ఏంటంటే…

సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఈ ఫోటోకు సంబంధించిన ఇల్లు మన దేశంలోనిది కాదట…అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందినదిగా తెలిసింది. యూఎస్ లోని ఓ వ్యక్తి తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. మూడు బెడ్ రూమ్ లు ఉన్న ఈ ఇంటి ఖరీదు 420000 డాలర్లుగా పేర్కొన్నాడు. అంటే సుమారుగా మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉంటుంది. అయితే.. ఆ ఇంటి నిర్మాణం నెటిజన్లను షాక్‌ అయ్యేలా చేస్తోంది. ఫోటోలు చూసిన ప్రతిఒక్కరూ అందులో టాయిలెట్ ఉన్న స్థలాన్ని చూసి అవాక్కవుతున్నారు. ఏకంగా మెట్లపై కింద కార్పెట్ తో సహా ఉన్న టాయిలెట్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు. కోట్ల ఇంటికి టాయిలెట్ తో స్వాగతం అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఎంట్రీ లోనే ఇన్ని వింతలు కనిపిస్తే.. ఇంట్లో ఇంకెన్ని వింతలు ఉన్నాయో అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మొత్తానికి నడి ఇంట్లో దర్శనమిస్తున్న ఈ టాయిలెట్‌ మాత్రం నెటిజన్లకు అంతుచిక్కని మిస్టరీగా తయారైంది. కామెంట్లు, షేర్లతో సోషల్‌ మీడియాలో దూసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి
Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!