AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video:పెళ్లిచూపులు ట్వీట్..! అబ్బాయి అడిగిన ప్రశ్నలకు నెటిజన్ల ఆన్సర్‌ హైలైట్..!

పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన, కీలక ఘట్టం. జీవితంలో ఈ దశను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ఇక ఇందులో భాగంగానే జరిగే పెళ్లి చూపులు దశ మరింత కొత్తగా ఉంటుంది. పెద్దలు కుదర్చిన పెళ్లిలో..

Viral Video:పెళ్లిచూపులు ట్వీట్..! అబ్బాయి అడిగిన ప్రశ్నలకు నెటిజన్ల ఆన్సర్‌ హైలైట్..!
Marriage Meeting
Jyothi Gadda
|

Updated on: May 26, 2022 | 3:05 PM

Share

పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన, కీలక ఘట్టం. జీవితంలో ఈ దశను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. ఇక ఇందులో భాగంగానే జరిగే పెళ్లి చూపులు దశ మరింత కొత్తగా ఉంటుంది. పెద్దలు కుదర్చిన పెళ్లిలో.. ఒకరికొకరు తమకు అప్పటి వరకు తెలియని వారిని పెళ్లిచూపుల్లో కలుసుకోవాల్సి వస్తుంది. చాలా వరకు ముందుగా అమ్మాయిని చూసుకోవటానికి అబ్బాయివారు వెళ్తుంటారు..అప్పుడు అమ్మాయికి కొన్ని చిన్న చిన్న పరీక్షలు కూడా పెడుతుంటారు..ముఖ్యంగా అమ్మాయి ఎంతవరకు చదువుకున్నాం, పెళ్లి తర్వాత చదువుకుంటావా, ఉద్యోగం చేస్తావా..? లేదంటే ఇంటిపట్టున ఉంటావా..? ఇంకా అమ్మాయికి వంటచేయటం వచ్చా..? ఇంటి పనులు తెలుసా..? పాటలు పాడటం వచ్చా ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తారు..అయితే, అలాంటి పెళ్లి చూపులకు సంబంధించిన ఓ వింత సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అమ్మాయిని చూసుకునేందుకు వెళ్లిన ఓ అబ్బాయికి ఎదురైన విచిత్ర పరిస్థితి ఇది..దాంతో అతన్ని విపరీతంగా ఆడేసుకుంటున్నారు నెటిజన్లు..

అమ్మాయిని చూసేందుకు పెళ్లి చూపులకు వెళ్లిన ఓ అబ్బాయి తనకు ఎదురైన అనుభవాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. దానికి తన సందేహం కూడా జతచేశాడు..28ఏళ్ల ఆ యువకుడు పెళ్లి చూపులు నిమిత్తం అమ్మాయి ఇంటికి వెళ్లాడు..అతని వెంట తన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అయితే, పెళ్లిచూపులక వచ్చిన అతిథులకు ఏదో ఒక తినుబండారం అందించటం ఆనవాయితీ. అయితే, ఇక్కడ కూడా అదే జరిగింది. అమ్మాయి వంట బాగా చేస్తుందన్నారు ఆమె పుట్టింటివారు. దాంతో తనకు ఆకలిగా ఉందని తనకోసం ఒక దోశ వేయమని కోరాడట..దాంతో ఆ అమ్మాయి, ఓ తప్పకుండా అంటూ బరబరా వంటగదిలోకి వెళ్లి వెరైటీగా ఇలాంటి విచిత్ర దోశ వేసి తీసుకొచ్చింది. ఆ దోశను ఇప్పుడు నేను తిన్నాలో లేదో మీరే చెప్పండి అంటూ సదరు యువకుడు ట్వీట్ చేశాడు. అతను చేసిన ఈ ట్వీట్ కి నెటిజన్ల నుండి రకరకాల కామెంట్స్‌ వస్తున్నాయి.

పెళ్లి చూపుల్లో అబ్బాయికి ఎదురైన విచిత్ర పరిస్థితికి కొందరు నెటిజన్లు జాలి పడుతుండగా, మరికొందరు సీరియస్‌ అవుతున్నారు. ఒకరేమో ఆ అమ్మాయికి వంటరాదని ఇలా చెప్పకనే చెప్పిందంటున్నారు. మరికొందరు ఆ అమ్మాయికి మీతో పెళ్లి ఇష్టం లేదనుకుంటా..అంటున్నారు. ఇంకోందరేమో..నీకు వంటమనిషి కావాలా..? లేదంటే పెళ్లాం కావాలా..? అప్పుడే తను వేసిన దోశను ప్రపంచం ముందుపెట్టావంటే..ముందుముందు నీతో కష్టమేనంటు మరికొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.