Ambassador Car 2.0: మళ్లీ సందడి చేయడానికి సిద్ధమౌతున్న రాయల్ కార్.. మోడ్రన్ లుక్‌లో వీధుల్లోకి..

Ambassador Car: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కార్ అంటే అందరికీ బాగా పరిచయం ఉన్నది అంబాసిడరే. దాని గతమెంతో ఘనమైనది. 1990ల వరకు ఈ కార్ కలిగి ఉండటం అనేది ధనవంతులకు స్టేటస్ సింబల్. కానీ..

Ambassador Car 2.0: మళ్లీ సందడి చేయడానికి సిద్ధమౌతున్న రాయల్ కార్.. మోడ్రన్ లుక్‌లో వీధుల్లోకి..
Ambassador
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 26, 2022 | 2:25 PM

Ambassador Car: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కార్ అంటే అందరికీ బాగా పరిచయం ఉన్నది అంబాసిడరే. దాని గతమెంతో ఘనమైనది. 1990ల వరకు ఈ కార్ కలిగి ఉండటం అనేది ధనవంతులకు స్టేటస్ సింబల్. కానీ.. కాలక్రమంలో కొత్త టెక్నాలజీలు, కొత్త తరం కోసం వచ్చిన మోడ్రన్ కార్లతో కారు కనుమరుగైంది. దాదాపు ఏడు దశాబ్దాలుగా పీఎం నుంచి డీఎం వరకు అందరికీ ఫేవరెట్ కారుగా నిలిచిన అంబాసిడర్ మళ్లీ ఒక్కసారిగా సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పుడు దీన్ని కొత్త అవతార్‌లో లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హింద్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (HMFCI), ఫ్రెంచ్ కార్ కంపెనీ ప్యుగోట్ దీని డిజైన్, ఇంజిన్‌పై పని చేస్తున్నాయి. హిందూస్థాన్ మోటార్స్ కు సంబంధించిన చెన్నై ప్లాంట్‌లో అంబాసిడర్ కొత్త మోడల్ తయారు చేయబడుతోంది. ఇది కొత్త అవతార్‌లో అంబి అని పిలువబడనుంది. ఇది రాబోయే రెండేళ్లలో దేశ వీధుల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. దేశంలో ప్రైవేటు కంపెనీలు వచ్చిన తర్వాత అంబాసిడర్ మాయ తగ్గిపోయింది. చాలా ఏళ్ల పాటు కేవలం ప్రభుత్వ కొనుగోళ్లతోనే మనుగడ సాగించింది. 2014లో, హిందుస్థాన్ మోటార్స్ భారీ అప్పులతో పాటు డిమాండ్ లేమి కారణంగా అంబాసిడర్ ఉత్పత్తిని నిలిపివేసింది.

HMFCI అనేది CK బిర్లా గ్రూప్‌కు చెందిన సంస్థ. ఈ కంపెనీ కింద హిందుస్థాన్ మోటార్స్ పనిచేస్తోంది. అంబి అవతార్‌లో అంబాసిడర్‌ని తీసుకురావడానికి పని జరుగుతోందని HM డైరెక్టర్ ఉత్తమ్ బోస్ వెల్లడించారు. కొత్త ఇంజన్ కోసం మెకానికల్, డిజైన్ వర్క్ అధునాతన దశకు చేరుకుంది. మిత్సుబిషి కార్లు ఒకప్పుడు HM చెన్నై ప్లాంట్ లోనే ఉత్పత్తి చేశారు.

ఉత్పత్తి ఎందుకు ఆగిపోయింది..

చెన్నై ప్లాంట్ నుండి చివరిగా అంబాసిడర్ కారు 2014లో ఉత్పత్తి అయింది. 2014లో.. దేశంలోని ప్రాచీన కార్ కంపెనీ HM భారీ అప్పులు, డిమాండ్ లేమి కారణంగా అంబాసిడర్ ఉత్పత్తిని నిలిపివేసింది. HM హానర్ CK బిర్లా గ్రూప్ ఈ కారు బ్రాండ్‌ను 2017లో ఫ్రెంచ్ కంపెనీకి కేవలం రూ. 80 కోట్లకు విక్రయించింది. ప్యుగోట్ మన దేశ మార్కెట్ లోకి వచ్చేందుకు ఉత్సాహంగా ఉంది. 1990ల మధ్యలో కంపెనీ భారత్ లోకి ప్రవేశించింది. మన దేశంలోకి మెుదట్లో వచ్చిన విదేశీ కార్ల కంపెనీల్లో ఇది కూడా ఒకటి.

మరిన్ని బిజినెజ్ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్