Multibagger Returns: రెండేళ్లలోనే నాలుగు రెట్లు లాభాన్నిచ్చిన షేర్.. ఈ స్టాక్ మీ దగ్గర కూడా ఉందా..?

Multibagger Returns: షేర్ మార్కెట్‌(Share Market)లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా కాలంలో డీమ్యాట్(Demat) ఖాతాలు ఓపెన్ చేయడం చాలా ఈజీగా మారింది.

Multibagger Returns: రెండేళ్లలోనే నాలుగు రెట్లు లాభాన్నిచ్చిన షేర్.. ఈ స్టాక్ మీ దగ్గర కూడా ఉందా..?
Stock market
Follow us
Ayyappa Mamidi

|

Updated on: May 26, 2022 | 2:57 PM

Multibagger Returns: షేర్ మార్కెట్‌(Share Market)లో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా కాలంలో డీమ్యాట్(Demat) ఖాతాలు ఓపెన్ చేయడం చాలా ఈజీగా మారింది. రిటైల్ పెట్టుబడిదారులు తరచుగా మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి మంచి రాబడిని అందించే పెన్నీ స్టాక్‌(Penny Stock)ల కోసం చూస్తుంటారు. తక్కువ ధర ఉన్న కొన్ని పెన్నీ స్టాక్‌లు ఆశ్చర్యపోయేలా అద్భుతమైన రాబడిని అందించిన రికార్డును కలిగి ఉన్నాయి. ఈ కోవకు చెందినదే జేకే పేపర్ లిమిటెడ్ కంపెనీ షేర్ కూడా.

JK పేపర్ లిమిటెడ్ గత రెండేళ్లలో తన పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. దీని షేరు ధర మే 22, 2020న రూ. 88.05గా ఉంది. ప్రస్తుతం మే 22, 2022న దీని ధర రూ.350.30కి చేరుకుంది. FY22 నాల్గవ క్వార్టర్ లో కంపెనీ నికర ఆదాయం ఏకీకృత ప్రాతిపదికన రూ. 1339.82 కోట్లుగా ఉంది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 49.17 శాతం వృద్ధిని సాధించింది. అలాగే కంపెనీ పన్ను తర్వాత లాభం (PAT) కూడా 25.06% పెరిగి రూ.170.17 కోట్లకు చేరుకుంది. వాల్యుయేషన్ విషయంలో.. కంపెనీ ప్రస్తుతం 10.05x TTM PE వద్ద ట్రేడ్ అవుతోంది. అదే పరిశ్రమ PE 45.22xగా ఉంది. FY 21లో కంపెనీ ROE 18.15%, ROCE 16.57% గా ఉంది.

కంపెనీ వ్యాపారం వివరాలు..

దేశంలోనే ప్రఖ్యాత పేపరు ​​తయారీ సంస్థగా జేకే పేపర్ కు గుర్తింపు ఉంది. ఇది అనేక రకాలైన కాగితపు ఉత్పత్తులతో పాటు ప్రీమియం ప్యాకేజింగ్ బోర్డులను తయారు చేస్తోంది. ఇది దేశంలోని ఆఫీస్ పేపర్లు, కోటెడ్ పేపర్లు, రైటింగ్ & ప్రింటింగ్ పేపర్లు మరియు హై ఎండ్ ప్యాకేజింగ్ బోర్డ్‌ల తయారీలో అగ్రగామిగా ఉంది. కంపెనీకి ఉన్న మూడు పల్ప్ అండ్ పేపర్ మిల్లులు ఉన్నాయి. కంపెనీ సామర్థ్యం 761,000 టీపీఏగా ఉంది. కంపెనీ వ్యాపారం అమెరికా, మధ్యప్రాచ్యం, యూరప్, ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలతో సహా 60 కంటే ఎక్కువ దేశాలకు విస్తరించి ఉంది. ఈ రోజు ఉదయం జేకే పేపర్ లిమిటెడ్ షేరు 2.69 శాతం పెరిగి రూ.330.30 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠం రూ. 387.40 వద్ద ఉండగా.. దాని 52 వారాల కనిష్ఠం రూ. 149.35గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.