మస్కిటో నెట్ వాడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే.. మీ శరీరం దోమలకు విందు భోజనమే!
వేసవి, శరదృతువు కాలాలు వచ్చాయంటే చాలు.. ఇంటి చుట్టుపక్కల దోమలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఈ సీజన్లలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు దోమల నివారణ లిక్విడ్లు, కాయిల్స్ ఉపయోగిస్తే.. మరికొందరు అత్యంత సురక్షితమైన, మన్నికైన మార్గంగా ‘దోమల వల’ (మస్కిటో నెట్)ను ఆశ్రయిస్తారు.

వేసవి, శరదృతువు కాలాలు వచ్చాయంటే చాలు.. ఇంటి చుట్టుపక్కల దోమలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఈ సీజన్లలో డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు దోమల నివారణ లిక్విడ్లు, కాయిల్స్ ఉపయోగిస్తే.. మరికొందరు అత్యంత సురక్షితమైన, మన్నికైన మార్గంగా ‘దోమల వల’ (మస్కిటో నెట్)ను ఆశ్రయిస్తారు. ముఖ్యంగా గ్రామాల్లో దోమల వలల వాడకం చాలా ఎక్కువ. దోమల వల వేసుకుంటే ఇక మనల్ని ఏ దోమ కూడా ఏమీ చేయలేదని అంతా భావిస్తారు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక షాకింగ్ వీడియో చూస్తే మాత్రం మీ నమ్మకం ముక్కలైపోవడం ఖాయం!
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి దోమల వల లోపల ప్రశాంతంగా, హాయిగా నిద్రపోతుండటం కనిపిస్తుంది. పైకి చూస్తే అతను దోమల నుంచి రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లే అనిపిస్తుంది. అయితే, కెమెరా కాస్త నెమ్మదిగా అతని పాదాల వైపు తిరిగేసరికి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది. సదరు వ్యక్తి నిద్రలో తన పాదాలను దోమల వలకు ఆనుకుని ఉండేలా పెట్టాడు. అంతే.. నెట్ అవతలి వైపు నుంచి వందలాది దోమలు ఒక్కసారిగా అతని పాదాలను చుట్టుముట్టాయి. పెద్ద సంఖ్యలో ఆ దోమల దండును చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ దోమలు అతడిని ఎంత దారుణంగా కుడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ట్విట్టర్ (ఎక్స్) వేదికగా `@Bio_comunidad` అనే ఖాతా ద్వారా ఈ భయానక వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ 20 సెకన్ల క్లిప్‌ను షేర్ చేస్తూ.. “దోమలు విందు చేసుకుంటూ అమితానందంతో మునిగిపోయాయి” అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జత చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు ఏకంగా 35 లక్షల సార్లు వీక్షించారు. 8,000 కంటే ఎక్కువ మంది దీనిని లైక్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక యూజర్ భయపడుతూ.. “దీని దెబ్బకు డెంగ్యూ, చికున్‌గున్యా రెండూ ఒకేసారి వచ్చి చనిపోతారు” అని కామెంట్ చేయగా, మరొకరు “అసలు వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి అతడిని కాపాడకుండా ఏం చేస్తున్నాడు?” అని ప్రశ్నించారు. మరికొందరు “అతని పాదాలపై ఇన్ని దోమలు కుడుతున్నా అంత గాఢంగా ఎలా నిద్రపోతున్నాడు? ఇది చూస్తుంటేనే నాకు ఒళ్లంతా దురద పుడుతోంది” అని తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.
ఈ వీడియో మనకో ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. దోమల వలలు వాడటం మంచిదే అయినా, నిద్రపోయేటప్పుడు మన శరీర భాగాలు వలకు తాకకుండా చూసుకోవడం చాలా అవసరం. లేదంటే ఈ వైరల్ వీడియోలోని వ్యక్తిలాగే మన శరీరం కూడా దోమలకు విందు భోజనంగా మారిపోయే ప్రమాదం ఉంది.
వైరల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Los mosquitos están en un festín… y claramente lo están disfrutando muchísimo. 🦟😵💫pic.twitter.com/VEzkj9hrKo
— Comunidad Biológica (@Bio_comunidad) May 30, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
