Supreme court: చెల్లెలి కాపురం కోసం ఎడ్ల బండి పై సుప్రీం కోర్టుకు ! ఓ అన్న అనూహ్య పోరాటం..

తన చెల్లికి న్యాయం చేయాలని కోరుతూ వినూత్న నిరసన చెప్పాడు ఓ అన్న….అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి కుమిలిపోయాడు. ఇంటిల్లిపాది కలిసి పోరాడినా చెల్లెల్లి కాపురం చక్కబడలేదు..దాంతో ఇక రాష్ట్రంలో న్యాయం దొరకదని భావించిన ఆ అన్న..తోబుట్టువు కోసం తల్లితో కలిసి హస్తిన బాటపట్టాడు..అది కూడా బస్సు, రైల్లోనో కాదు, ఎడ్ల బండిపై దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరాడు ఏపీకి చెందిన యువకుడు నేలవెల్లి నాగదుర్గారావు. ఆంధ్రప్రదేశ్‌ లోని ఎన్టీఆర్‌ జిల్లా, నందిగామ […]

Supreme court: చెల్లెలి కాపురం కోసం ఎడ్ల బండి పై సుప్రీం కోర్టుకు ! ఓ అన్న అనూహ్య పోరాటం..
Bullock Cart
Follow us
Jyothi Gadda

| Edited By: Ram Naramaneni

Updated on: May 26, 2022 | 10:00 PM

తన చెల్లికి న్యాయం చేయాలని కోరుతూ వినూత్న నిరసన చెప్పాడు ఓ అన్న….అత్తింటి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చిన చెల్లిని చూసి కుమిలిపోయాడు. ఇంటిల్లిపాది కలిసి పోరాడినా చెల్లెల్లి కాపురం చక్కబడలేదు..దాంతో ఇక రాష్ట్రంలో న్యాయం దొరకదని భావించిన ఆ అన్న..తోబుట్టువు కోసం తల్లితో కలిసి హస్తిన బాటపట్టాడు..అది కూడా బస్సు, రైల్లోనో కాదు, ఎడ్ల బండిపై దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరాడు ఏపీకి చెందిన యువకుడు నేలవెల్లి నాగదుర్గారావు.

ఆంధ్రప్రదేశ్‌ లోని ఎన్టీఆర్‌ జిల్లా, నందిగామ మండలం ముప్పాల గ్రామానికి చెందిన నేలవెల్లి నాగ దుర్గారావు సోదరి నేలవెల్లి నవ్యతను అదే మండలంలోని చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌ కు ఇచ్చి 2018లో వివాహం చేశారు. కట్నంగా 23 లక్షల రూపాయల నగదు, 320 గ్రాముల బంగారం, మూడు ఎకరాల పొలం ఇచ్చినట్లు నవ్యత సోదరుడు దుర్గారావు తెలిపారు. వివాహం జరిగిన నాటి నుండి తన భర్త కొంగర నరేంద్రనాథ్‌ తనతో సరిగా ఉండటం లేదంటూ నవ్యత తన ఆడబిడ్డ కంటమనేని మధుర స్రవంతికి చెప్పింది. ఈ విషయంపై స్పందించిన మధుర స్రవంతి ఇట్టి విషయాన్ని బయటకు చెప్పవద్దని, తమ కుటుంబ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయమని, మా అన్నకు వైద్యం చేపిస్తానని మాట ఇచ్చింది. కానీ ఈ విషయాన్ని పట్టించుకోకుండా తన దారి తాను చూసుకుని జర్మనీ వెళ్లిపోయిందని నవ్యత సోదరుడు వాపోయాడు.

అంతేకాదు, కొంగర నరేంద్రనాథ్‌ కుటుంబ సభ్యులు నవ్యతను బెదిరించి ఆమె చేత బ్లాంక్‌ పేపర్‌లపై సంతకాలు చేయించుకున్నారని నవ్యత సోదరుడు నేలవెల్లి దుర్గారావు పేర్కొన్నాడు. జరిగిన ఉదంతంపై చందర్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపాడు. కానీ, నవ్యత అత్తమామలు తమ పరపతి ఉపయోగించడంతో కేసులో ఎలాంటి పురోగతీ లేకపోయిందని వాపోయాడు. దీంతో విసిగిపోయిన తాను ఇక తమకు ఏపీలో న్యాయం దొరకదని భావించి, తన తల్లితో కలిసి ఎడ్లబండిపై ఢిల్లీ చేరుకుని సుప్రీంకోర్టు, హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి

తమకు సరైనా న్యాయం కోసం ఢిల్లీకి పయనమయ్యారు. న్యాయం కావాలని కోరుతూ నరేంద్రనాథ్‌ కుటుంబ సభ్యుల ఫోటోలతో కూడిన ప్లెక్సీని ఎడ్ల బండికి ఏర్పాటు చేయగా, ఈ విషయంపై నరేంద్రనాథ్‌ కుటుంబ సభ్యులు తమపై 50 లక్షలు పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు. ఈ సంఘటనపై తగు న్యాయం కోసం ఎడ్లబండిపై ఢిల్లీ చేరుకొని సుప్రీంకోర్టు న్యాయస్థానానికి వెళుతున్నానని, అవసరమైతే హెచ్‌ఆర్సీని ఆశ్రయిస్తామని చెప్పారు. తమ ప్రయాణంలో భాగంగా రోజుకు 20 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తున్నామని, రెండు నెలల్లో ఢిల్లీ చేరి న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.