Chittoor : చిత్తూరు టూ చెన్నై…అర్జెంట్‌గా దూసుకెళ్తున్న అంబులెన్స్‌..! అత్యవసరంగా ల్యాండ్‌ అయిన పోలీసులు..బొమ్మ అదిరింది!!

సినిమాలను చూసి స్మగ్లర్లు ఇన్‌స్పైర్‌ అవుతారో, లేదంటే జరుగుతున్న అక్రమ వ్యాపారాలను ఆధారంగా చేసుకుని సినిమాలు తీస్తారో తెలియదుగానీ,ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సినిమా రెంజ్‌లో అక్రమ వ్యాపారానికి తెరలేపారు.

Chittoor : చిత్తూరు టూ చెన్నై...అర్జెంట్‌గా దూసుకెళ్తున్న అంబులెన్స్‌..! అత్యవసరంగా ల్యాండ్‌ అయిన పోలీసులు..బొమ్మ అదిరింది!!
Ambulance Loaded
Follow us

|

Updated on: May 26, 2022 | 8:34 PM

సినిమాలను చూసి స్మగ్లర్లు ఇన్‌స్పైర్‌ అవుతారో, లేదంటే జరుగుతున్న అక్రమ వ్యాపారాలను ఆధారంగా చేసుకుని సినిమాలు తీస్తారో తెలియదుగానీ,ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సినిమా రెంజ్‌లో అక్రమ వ్యాపారానికి తెరలేపారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఉపయోగించే అంబులెన్స్ లో అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు కేటుగాళ్లు. అధికారుల కళ్లు గప్పి అంబులెన్స్‌లో సీక్రెట్‌గా ఎర్రచందనం తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. చిత్తూరు జిల్లాఓ పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే…

ఎర్రచందనం దొంగలు నయా ప్లాన్ తో దుంగలు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. చిత్తూరు జిల్లా నుంచి చెన్నైకి అంబులెన్స్ లో ఎర్రచందనం తరలిస్తూ దొరికిపోయారు. రూ.కోటి విలువైన 71 ఎర్రచందనం దుంగలు సీజ్ చేశారు. ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న 15మందిని అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. చిత్తూరు జిల్లా చిత్తూరు మండల పోలీసులు 15మంది అంతర్‌ రాష్ట్ర స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ప్రధాన సూత్రదారులు పెరుమాళ్‌, అజిత్‌, వినోద్‌, శరత్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులందరూ తమిళనాడుకు చెందిన స్మగ్లర్లుగా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

నిన్న కూడా చిత్తూరు జిల్లా తిరుపతి డివిజన్ బాలాపల్లి రేంజ్ పరిధిలో, రైల్వే కోడూరు మండలం లోని అన్నదమ్ముల బండ పరిసర ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి 22 ఎర్రచందనం దుంగలు, ఒక మోటారు సైకిల్ లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందరరావు ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ …ఇందుకు సంబంధించి ఐదుగురు స్మగ్లర్లు ను అరెస్టు చేశామని తెలిపారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారుల మంగళవారం నుంచి వివిధ ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు.

ఇవి కూడా చదవండి
మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం..
మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??