Hanuman Jayanti: అనకాపల్లిలో హనుమాన్ జయంతి వేడుకలు…భజరంగ బలి ప్రసాదంగా మహా నైవేధ్యం..!
హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ బలిని ఆచారా ప్రకారం పూజిస్తారు భక్తులు. ఆంజనేయుడికి ఇష్టమైన ప్రసాదాన్ని నైవేధ్యంగా అందిస్తారు. హనుమంతుడికి ఇష్టమైన పదార్థాలను అందించడం ద్వారా
హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ బలిని ఆచారా ప్రకారం పూజిస్తారు భక్తులు. ఆంజనేయుడికి ఇష్టమైన ప్రసాదాన్ని నైవేధ్యంగా అందిస్తారు. హనుమంతుడికి ఇష్టమైన పదార్థాలను అందించడం ద్వారా ఆయన సంతోషిస్తాడని, తమకు కరుణ కటాక్షాలను కురిపిస్తాడని భక్తుల నమ్మకం. కోరిన కోరికలను తీరుస్తాడని హనుమ భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు.. జీవితంలోని ఇబ్బందులను తొలగించడం పురోగతికి మార్గం చూపే దేవుడు ఆ అభయాంజనేయుడు. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజు బజరంగబలికి ఇష్టమైన ఈ ప్రసాదాలను అందిస్తారు..ఈ క్రమంలోనే ఓ చోట 200కేజీల లడ్డూలను ప్రసాదం తయారు చేయించారు భక్తులు. పూర్తి వివరాల్లోకి వెళితే…
అనకాపల్లి జిల్లా చోడవరంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వ్యాపారవీధి ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతిని భక్తిశ్రద్ధలతో జరిపించారు. ఆలయ మూలవిరాట్ కు పంచామృతాలతో అభిషేకం చేశారు. 200 కేజీల లడ్డూలతో శతసహస్ర నామార్చన నిర్వహించారు. దింతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. పూజలు చేశారు.