atmakur by poll: ఆత్మకూరు ఉప ఎన్నికపై బీజేపీ క్లారీటీ.. బరిలోకి మేకపాటి బంధువు..! తప్పని ఉత్కంఠ

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థి విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు….ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ బరిలో ఉంటుందని తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినట్టే ఆత్మకూరు ఉప ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని స్పష్టం చేశారు…దీంతో ఇప్పటి వరకు ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి విజయం ఏకగ్రీవం అవుతుంది అనుకున్న వారికి ఉప ఎన్నికలో పోటీ తప్పదని క్లారిటీ వచ్చింది. ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే […]

atmakur by poll: ఆత్మకూరు ఉప ఎన్నికపై బీజేపీ క్లారీటీ.. బరిలోకి మేకపాటి బంధువు..! తప్పని ఉత్కంఠ
By Poll
Follow us
Jyothi Gadda

|

Updated on: May 26, 2022 | 8:49 PM

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థి విషయమై ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు….ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ బరిలో ఉంటుందని తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినట్టే ఆత్మకూరు ఉప ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని స్పష్టం చేశారు…దీంతో ఇప్పటి వరకు ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి విజయం ఏకగ్రీవం అవుతుంది అనుకున్న వారికి ఉప ఎన్నికలో పోటీ తప్పదని క్లారిటీ వచ్చింది.

ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో ఆయన సతీమణి కీర్తి రెడ్డికి వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చి ఏకగ్రీవం చేస్తుందని అనుకున్నారు. అయితే మేకపాటి కుటుంబ సభ్యులు మాత్రం కీర్తి రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆత్మకూరు స్థానం నుంచి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తారంటూ ఇప్పటికే వైసీపీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు…అయినప్పటికీ ఆత్మకూరు లో ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని బీజేపీ అధ్యక్షుడు ప్రకటించడం తో ఇక్కడ ఉప ఎన్నిక పోరు తప్పదని స్పష్టం అయింది.

ఇవి కూడా చదవండి

బీజేపీ నుంచి పోటీ చేసేందుకు మేకపాటి రాజమోహన్ రెడ్డి మేనల్లుడు, ఆకుటుంభానికి చిరకాల ప్రత్యర్థి గా ఉంటూ.. నిత్యం మేకపాటి పై ఆరోపణలు చేసే బిజివేముల రవీంద్రనాథ్‌ రెడ్డి పోటీకి సిద్ధమని ఇప్పటికే ప్రకటించారు.. బీజేపీ నుంచి పోటీ, చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.. ఎపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తో భేటి అయి చర్చించారు కూడా.. అయితే ఆత్మకూరు లో బీజేపీ అభ్యర్థి గా పోటీ చేసే వ్యక్తి ప్రస్తుతం పార్టీ లో ఉన్న వ్యక్తా లేదా బయటనుంచి ఇక్కడికి పోటీ చేసే వ్యక్తా అనేది తెలియాల్సి ఉంది.