ఘాటు వాసన రాకుండా చేపలు వేయించాలా? జస్ట్ ఇలా చేయండి చాలు
31 May 2026
Anand T
అన్నంలోకి ఎండుచేప ముక్క నంచుకుని తింటే ఆ రుచే వేరు. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. కానీ, దీనిని వేయించేటప్పుడు వచ్చే ఘాటైన వాసన చాలా మందికి నచ్చదు.
ఎండుచేపలు వేపేటప్పుడు వచ్చే వాసన మన ఇంట్లోనే కాకుండా పక్క ఇంట్లోకి కూడా వ్యాపిస్తోంది. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను ఈజీగా చెక్ పెట్టవచ్చు
అయితే చేప ముక్కలను నూనెలో వేయించేటప్పుడు, వాటితో పాటు ఒకటి లేదా రెండు చిన్న చింతపండు ముక్కలను కూడా నూనెలో వేయండి.
ఇలా నూనెలో చింతపండు వేయడం వల్ల ఆ ముక్కలు, ఎండుచేపల నుండి వచ్చే తీవ్రమైన ఘాటు వాసన బయటకు రాకుండా అణచివేస్తాయి.
అలా కాకపోతే చేపలను వేయించడానికి 10 నిమిషాల ముందు, కొద్దిగా గోరువెచ్చని నీటిలో వెనిగర్ లేదా నిమ్మరసం కలపండి.
ఆ కలిపిన గోరువెచ్చని నీటిలో ఎండుచేపలను 10 నిమిషాల పాటు నానబెట్టడం వల్ల, వేయించేటప్పుడు వచ్చే వాసన సగానికి సగం తగ్గిపోతుంది.
మరో చిట్కా ఏంటంటే చేప ముక్కలకు మసాలా పట్టించేటప్పుడు కొద్దిగా అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలపండి. లేదా చేపలు వేగుతున్న నూనెలోనైనా ఈ పేస్ట్‌ను నేరుగా వేయవచ్చు.
వంట పూర్తయిన తర్వాత కూడా కిచెన్‌లో ఎండుచేపల వాసన అలాగే ఉంటే... ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి, అందులో కొద్దిగా కాఫీ పొడి వేసి బాగా మరిగించండి.