AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wife For Sale: భార్య పండగలకు, సెలవులకు ఇంట్లో ఉండడం లేదని.. ఆన్ లైన్‌లో అమ్మకానికి పెట్టిన భర్త ఎక్కడంటే..

నా భార్య అమ్మకానికి ఉంది, ఎవరైనా కొనాలనుకుంటే.. తనను సంప్రదించమని కోరాడు. లైఫ్ బోరింగ్‌ కొట్టిన భర్త ఇంత భారీ నిర్ణయం తీసుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Wife For Sale: భార్య పండగలకు, సెలవులకు ఇంట్లో ఉండడం లేదని.. ఆన్ లైన్‌లో అమ్మకానికి పెట్టిన భర్త ఎక్కడంటే..
Wife For Sale
Surya Kala
|

Updated on: May 27, 2022 | 10:22 AM

Share

Wife For Sale: భార్యాభర్తల మధ్య గొడవలు, చిన్న చిన్న తగువులు సర్వసాధారణంగా జరిగేవే. ముఖ్యంగా భర్తను విడిచి ఏదైనా పనిమీద దూరంగా వెళ్లే భార్య విషయంలో భర్త చేసే ఫిర్యాదులైతే.. నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. అయితే తమ మధ్య ఎన్ని తగవులు వచ్చినా.. ఇద్దరూ సర్దుకు పోతూ.. తమ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తారు. ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఒక చిలిపి భర్త తనతో గొడవ పడిన భార్య విషయంలో ఒక హాస్యాస్పదమైన పని చేసాడు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  భర్త చేసిన పని గురించి తెలిస్తే..  మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి భార్య  సెలవులకు ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. ఇంతలో, ఆ వ్యక్తి తన భార్యను అమ్మకానికి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు తన భార్యని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టాడు! పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Nypost ప్రకారం.. ఈ వింత కేసు ప్యూర్టో రికో  గ్రాన్ కానరియా ద్వారా వెలుగులోకి వచ్చింది. 38 ఏళ్ల రాబీ మెక్‌మిలన్..  చిలిపి వ్యక్తి.. గత 20 ఏళ్లుగా భార్య సారాతో హాయిగా జీవితం గడుపుతున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రాబీ సారాతో బాగా కలిసిపోతాడు. అయితే గత నెలలో రబీ కి సారా మధ్య చిన్న క్లాష్ వచ్చింది. దీంతో రాబీ తన భార్యకు తెలియజేయకుండా ఆమెను ఆన్‌లైన్ సేల్‌లో పెట్టాడు.  నా భార్య అమ్మకానికి ఉంది, ఎవరైనా కొనాలనుకుంటే.. తనను సంప్రదించమని కోరాడు. లైఫ్ బోరింగ్‌  కొట్టిన భర్త ఇంత భారీ నిర్ణయం తీసుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

‘నా భార్య అమ్మకానికి ఉంది’

ఇవి కూడా చదవండి

నిజానికి, రాబీకి అతని భార్య సారాతో ఎలాంటి విబేధాలు లేవు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు లేవు. అయితే తన భార్య పండగల సమయంలో ఇంట్లో లేకపోవడంతో రాబీకి కాస్త బాధ కలిగింది. దీని తర్వాత ఏప్రిల్ 17న ఫేస్‌బుక్‌లో తన భార్య అమ్మకానికి సంబంధించిన ప్రకటన ఇచ్చాడు. అతను తన పోస్ట్‌లో ‘సగటు కంటే మెరుగైనది’ అని రాశాడు. అయితే తన భార్యని అమ్మకానికి పెడుతూ.. తన సారాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. చాలా విషయాలు ప్రస్తావించాడు. అంతేకాదు భార్యకు సంబంధించిన కొన్ని చిత్రాలను కూడా పోస్ట్ చేశాడు. అయితే, రాబీ తన భార్యను ఇంతకు అమ్మాలనుకుంటున్నాడో మాత్రం ధర పేర్కొనలేదు.

రాబీ చేసిన ఈ వింత పోస్ట్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సారా తన భర్త పెట్టిన  పోస్ట్‌ను చూసినప్పుడు.. ఆమె కోపం తెచ్చుకోలేదు కానీ తన భర్త చిలిపిని చూసి నవ్వింది. ప్రజలకు స్పందిస్తూ.. రాబీ ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాడని, చిలిపి పనులు చేయడమంటే అతనికి ఇష్టమని కామెంట్ చేశారు. బహుశా అతను తన జ్ఞాపకాల్లో దాచుకునేందుకు ఇలాంటి చిలిపి పనులను చేస్తుంటాడని అంటున్నారు. మరొకరు ఈ పోస్టుపై  వ్యాఖ్యానిస్తూ..  నా భార్య లక్షల్లో ఒకటి, కానీ ప్రస్తుతం ఆమె మార్కెట్లో అందుబాటులో లేదని సరదాగా కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..