Viral News: వింత హాబీ.. 400 సాలెపురుగులను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మహిళ..
ఇప్పుడు ఓ మహిళ ఎవరూ పెంచుకో]ని జీవులను పెంచుకుంటూ.. వార్తల్లో నిలిచింది. అవును, ఇంగ్లండ్‌లో నివసిస్తున్న ఓ మహిళ సాలెపురుగులను పెంపుడు జంతువుగా మార్చుకుని.. వాటిని ఇష్టంగా పెంచుతోంది.
Strange hobby of woman: లొకో భిన్నరుచిః అంటే కొంతమంది వ్యక్తుల అభిరుచులు చాలా విచిత్రంగా ఉంటాయి. అయితే కొంతమంది అలవాట్లు, అభిరుచులు గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రజలు సాధారణంగా తమ ఇళ్లలో కుక్కలు, పిల్లులను, కుందేళ్లు వంటి వాటిని పెంచుకుంటారు. విదేశాల్లో అయితే కొంతమంది పందులను కూడా పెంచుకుంటారు, అయితే కొంతమంది వివిధ రకాల జంతువులను పెంపుడు జంతువులను ఇష్టపడతారు. ఇటీవల ఓ వ్యక్తి తన ఇంట్లో బల్లిని పెంపుడు జంతువుగా పెట్టుకున్నాడనే వార్త వైరల్ అయితే.. ఇప్పుడు ఓ మహిళ ఎవరూ పెంచుకో]ని జీవులను పెంచుకుంటూ.. వార్తల్లో నిలిచింది. అవును, ఇంగ్లండ్‌లో నివసిస్తున్న ఓ మహిళ సాలెపురుగులను పెంపుడు జంతువుగా మార్చుకుని.. వాటిని ఇష్టంగా పెంచుతోంది. ఇప్పుడు ఆ మహిళ ఇంట్లో విషపూరిత సాలెపురుగులతో సహా దాదాపు 400 సాలెపురుగులతో నివసిస్తున్నాయి. వీటిల్లో కొన్ని రకాల సాలెపురుగులు విషపూరితమైనవి.. కాటు వేస్తే.. బాధిత వ్యక్తికి జ్వరం వచ్చే అవకాశం ఉంది.
డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. విల్ట్‌షైర్ నివాసి 28 ఏళ్ల బెథానీ స్టేపల్స్ కు మొదట్లో సాలెపురుగులు అంటే చాలా భయపడేది. ఇంట్లో ఎక్కడ సాలెపురుగులను చూస్తే.. వాటిని తరిమికొట్టాలని భావించేది. అయితే ఒకరోజు బెథానీకి జరిగిన సంఘటన తర్వాత ఆమె మదిలో ఒక ఆలోచన కలిగింది. సాలిపురుగులకు భయపడే బదులు.. వాటిని పెంచాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి సాలెపురుగులను పెంపుడు జంతువుగా మార్చుకుంది. సాధారణ సాలెపురుగులతో పాటు థాయిలాండ్ బ్లాక్స్ , రోజ్ హెయిర్ టరాన్టులా వంటి విషపూరిత సాలెపురుగులు కూడా ఆమె పెంపుడు సాలెపురుగుల్లో ఉన్నాయి.
ఇంట్లో 400 సాలెపురుగులు: నివేదికల ప్రకారం, బెథానీ ఇంట్లో 400 సాలెపురుగులు నివసిస్తున్నాయి, వాటిలో 150 పెద్ద సాలెపురుగులు కాగా 250 వాటి పిల్లలు. ఇప్పుడు బెథానీ స్నేహితులు కూడా ఆమె ఇంటికి రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది. బెథానీ ఇంట్లో సాలెపురుగులు మాత్రమే కాదు, తేళ్లు, రాట్‌వీలర్ కుక్కలు, అనేక రకాల కీటకాలు వంటి జీవులు కూడా ఉన్నాయని తెలిస్తే ఎవరైనా షాక్ తింటారు. ఈ జీవులన్నిటిని పెట్టెల్లో బంధించింది . తాను పెంచిన కొన్నింటిని ఇతర కీటకాలకు బొద్దింకలకు ఆహారంగా ఇస్తుంది.
నివేదికల ప్రకారం, ఒకసారి బెథానీ తన ఇంటి బాత్రూంలో ఉన్నప్పుడు.. ఒక సాలీడుఆమె దగ్గరకు వచ్చింది. అప్పుడు సాలీడును చూసి ఆమె చాలా భయపడిపోయింది. వాటిని తరిమికొట్టడానికి స్నేహితుడిని ఇంటికి పిలవాల్సి వచ్చింది. ఈ సంఘటనతో ఆమె చాలా ఇబ్బంది పడింది. అనంతరం తాను సాలెపురుగులంటే భయం తొలగించుకోవాలి ఆలోచించింది. ఇప్పుడు వాటిని పెంచడం ప్రారంభించింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..